Breaking News

ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని కాదని ట్రావెల్‌ వీడియోలు..!

Published on Mon, 08/24/2026 - 11:31

రిస్క్‌ ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు అని అంటుంటారు పెద్దలు. కొన్ని సమయాల్లో డేర్‌గా నిర్ణయాలు తీసుకుంటేనే లైఫ్‌ టర్న్‌ అవుతుంది. కొన్ని సమయాల్లో మంచి పొజిషన్లో ఉన్నా..మనశ్శాంతి, ఆత్మసంతృప్తి కోసంకొందరు తమకు నచ్చిన రంగంలో కొనసాగుతుంటారు. అంతకుముందు జీవితంలోలా మంచి హోదా, ఎక్కువ జీతం లేకపోయినా..అందులోనే కొనసాగి తమ ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. అలాంటి వ్యక్తే ఈ టెకీ. కానీ ఈ వ్యక్తి చేసిన అతిపెద్ద సాహసం తెలిస్తే విస్తుపోతారు. అంత మంచి వేతనాన్ని ఎలా వదుకోగలిగాడు అని కచ్చితంగా ఆశ్చర్యపోతారు. 

అతడే సాక్షమ్‌ రాజ్‌ సేథ్‌. అతడొక టెక్‌ నిపుణుడు. ట్రావెల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా పూర్తి స్థాయిలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఏటా రూ. 85 లక్షలు పైనే ఆర్జించే ప్యాకేజ్‌ని తృణప్రాయంగా వదిలేశారు. ఆయన అంతపెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ..ఆయన భాగస్వామి స్మృతి సిదానా మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా నెలకు రూ. 1.5 లక్షల జీతంతో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తుందామె. 

అయితే సాక్షమ్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగం నచ్చకపోవడం లేదా పనిచేయడం ఆపేయాలనో కాదు. కాలక్రమేణం జీవిత ఏదో యాంత్రికంగా మారిపోతున్న ఫీల్‌ కలిగి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంచి ఆదాయం వస్తున్నప్పటికీ తనకు నచ్చినట్లుగా సమాయన్ని గడిపే స్వేచ్ఛ లేకపోతున్నట్లు అనిపించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను అధిక జీతం కంటే స్వేచ్ఛ, కొత్త అనుభవాలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. 

 

తాము అప్పటికే ట్రావెల్‌ కంటెంట్‌ని రూపొందిస్తుండటంతో..రిస్క్‌ తీసుకుని పూర్తి స్థాయిలో దీనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఈ నిర్ణయం ఒక్క రాత్రిలో తీసుకున్నది కూడా కాదని చెప్పారు. నిజానికి ఏకంగా రూ. 85 లక్షల జీతం వదిలేయడం అంటే..ఆర్థిక భద్రతను, సౌకర్యమంతమైన జీవనశైలిని స్వచ్ఛందంగా వదులుకోవడం, పైగా అనిశ్చితితో కూడిన మార్గాన్ని ఎంచుకోవడం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అనిశ్చితి అనేది అతిపెద్ద సవాలని, ఎందుకంటే..మంచి వేతనం అందించే ఉద్యోగాన్ని వదులుకోవడం సులువు గానీ, అంతే స్థిరమైన మరో ఆదాయ వనరు ఎప్పటికీ కష్టమేనని అన్నారు. 

తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సంపాదించిన దానికి ప్రస్తుతం కంటెంట్‌ క్రియేటర్‌గా పొందే వేతనానికి  ఏమాత్రం పోలిక ఉండదు. ఇలాంటి నిర్ణయాన్ని కచ్చితంగా ఆర్థికంగా వెనుకడుగు వేయడంగానే పేర్కొనవచ్చు. పైగా ఈ కొత్త కెరీర్‌లో విజయం సాధించాలనే ఒత్తిడి కూడా చాలా ఎక్కువుగా ఉంటుందని సాక్షమ్‌ అన్నారు. కంటెంట్ క్రియేషన్‌లో స్థిరమైన జీతం, గ్యారెంటీ లేని ఎదుగుదల లేదా నిర్దిష్టమైన కెరీర్ మార్గం ఉండవని అంగీకరించారు. ఈ వృత్తిలో నిరంతరం కంటెంట్‌ని రూపొందిస్తూ..కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయడం, బ్రాండ్‌లను సంప్రదించడం వంటివి ఉంటాయి. 

ఇక్కడ ప్రయాణాలను శాశ్వత సెలవుల్లా పరిగణించలేమని అన్నారు. ఎందుకంటే కంటెంట్‌ క్రియేషన్‌, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత సమయాన్ని సమతుల్యం చేసుకోవడం వంటివి నేర్చుకోవాలి. ఇక ఆయన భార్య స్మృతి వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినా..పార్ట్‌టైమ్‌గా ప్రయాణ జీవనశైలికి సంబంధించిన కంటెంట్‌ను కూడా సృష్టిస్తుంది. తమ జీవితం మరింత అనిశ్చితంగా మారినప్పటికీ, అది మరింత సార్థకంగా కూడా అనిపిస్తోందని ఆమె పేర్కొంది. ఇక తన భర్తలో వచ్చిన అతిపెద్ద మార్పు సమయంపై చక్కటి నియంత్రణ కలిగి ఉండటమేనని అన్నారు. 

ఆయన ఇప్పుడు తన రోజుని ఎలా గడాపాలనుకుంటున్నాడో స్వేచ్ఛగా నిర్ణయించుకోగలడు. అయితే ఈ జీవనశైలిని అస్సలు ఆదర్శంగా భావించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే..పూర్తికాల క్రియేటర్‌గా ఉండటం కూడా ఒక పనే. ఇందులో షూట్‌లు, ఎడిటింగ్, బ్రాండ్ సంప్రదింపులు, ప్రణాళిక, పిచింగ్, ప్రజలు చూడాలనుకునేదాన్ని నిరంతరం సృష్టించాలనే ఒత్తిడివంటివి ఉంటాయంటూ..సోషల్‌ మీడియా వేదికగా తమ జీవనశైలిని వివరించారు. ఇక్కడ ప్రయణాలు మనుషుల ఆలోచన విధానాన్ని, జీవితం పట్ల వారి దృక్పథాన్నే మార్చే శక్తిని కలిగి ఉంటాయనే విషయాన్ని చాటిచెప్పాయి. 

 

(చదవండి: ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్‌, పీహెచ్‌డీ..)
 

 

#

Tags : 1

Videos

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

లింగమనేని కొడుకు వీడియో తీసింది ఎవరంటే.. అది బయటపడటానికి కారణం కూడా..

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)