చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!

Published on Wed, 06/03/2026 - 16:35

చిన్నపాటి స్టోర్‌ మాదిరి రెస్టారెంట్‌ నుంచి ఏకంగా లగ్జరీ రెస్టారెంట్ల రేంజ్‌కి చేరుకోవడం అంత ఈజీకాదు. పైగా ఆతిథ్య రంగంలో తనకంటూ గర్తింపు తెచ్చుకుని ప్రసిద్ధ బాండ్‌ రెస్టారెంట్‌లతో కోట్లలలో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడు ఈ సక్సెస్‌ని ఎలా అందుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక పారిశ్రామికవేత్తకు ఉండాల్సిన ముఖ్య లక్షణమేంటో తప్పక తెలుస్తుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. 

అతడే ఇంప్రెసారియో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్‌ హాస్పిటాలిటీ సంస్థకు వ్యవస్థాపకుడు రియాజ్ ఆమ్లానీ. అతడు చిన్నగా మొదలు పెట్టిన రెస్టారెంట్‌ వ్యాపారం అనతికాలంలోనే సోషల్, స్మోక్ హౌస్ డెలి, పృథ్వీ కేఫ్, స్లింక్ అండ్‌ బార్డోట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్‌ల రెస్టారెంట్లు రన్‌ చేసే రేంజ్‌కిచేరుకున్నాడు. అంతేగాదు భారతదేశ ఆహార, పానీయాల పరిశ్రమలో తన పేరుని నిలిచేలా చేసుకున్నాడు. 

తన బ్రాండ్‌ల వెనుకు ఉన్న తన ఫుడ్‌ బేవరేజ్‌ సంస్థ ఇంప్రెసారియో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్‌  హాస్పిటాలిటీ సంస్థ సీఈవో రియాజ్‌ ఎలాంటి సక్సెస్‌ సూత్ర పాటించి ఈ రేంజ్‌కి వచ్చాడంటే..ప్రజల ఫీడ్‌బ్యాక్‌ని ఆధారంగా అని చెబుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లు ఇష్టపడే ప్రదేశాలు వంటి వాటిపై చర్చించి ఆ దిశగా తన రెస్టారెంట్‌లలో అవి ఉండేలా ఏర్పాట్లు చేశాడట. 

ముంబైకి చెందిన ఈ వ్యాపారవేత తన 35 ఏళ్ల వ్యాపార జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనని, అదే తన విజయ రహస్యమని అంటున్నారు. ప్రజలు ఆనందించగల ప్రదేశాలనే నిర్మిస్తా..అదే తన రెస్టారెంట్లను విజయవంతంగా నడిపిస్తుందని అంటున్నారు. ఆయన తన రెస్టారెంట్ల వ్యాపారం నుంచి దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తాడట. మన కళ్ల ముందే చాలా కంపెనీలు ఆతిథ్య రంగంలోకి వచ్చి ఇబ్బంది పడ్డాయి. తీవ్రమైన పోటీ ఉండే ఈ రంగంలో తను నిలదొక్కుకోవడానికి కీలకం కస్టమర్లే అంటాడు. 

మొదట కస్టమర్ల ప్రాధాన్యత, ఆ తర్వాత అవి అమలు చేయడంలో కలిగే సానుకూల, ‍ప్రతికూల అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తానని అంటున్నాడు. తన కుటుంబ వ్యాపారమైన బెర్రీస్‌ రెస్టారెంట్‌ నుంచి మొదలైందట. అక్కడ నుంచే మొరాకో-శైలి కేఫ్ అయిన 'మోచా' ద్వారా ఆతిథ్య వ్యాపారంలోకి వచ్చినట్లు తెలిపారు. 

అలా తన కుటుంబ వ్యాపారం అంచలంచెలుగా విస్తరించి ఆతిథ్య సంస్థగా ఎదిగిందన్నారు. చివరగా ఆయన ఎదగడానికి రెండు మార్గాలున్నాయన్నారు. మొదటిది విశ్రాంతి తీసుకుంటూ వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స​ చేసి ఎదగొచ్చు , రెండు పూర్తిగా పనికే ప్రాధాన్యత ఇచ్చి కెరీర్‌పై దృష్టి పెట్టొచ్చు. ఆ విధంగా నిబద్ధతతో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై అటెన్షన్‌ పెడితే విజయం తథ్యం అని అన్నారు. 

(చదవండి: సినిమా సీన్‌ని తలపించేలా.. ఆర్మీ పైలట్‌ లవ్‌ ప్రపోజ్‌!)
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)