Breaking News

వైద్యవృత్తిని చేపట్టిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌..!

Published on Sun, 07/05/2026 - 13:54

చాలామందికి పలు అభిరుచులు ఉంటాయి. కానీ ఏదో ఒకరంగం ఎంచుకుని విజయవంతంగా కెరీర్‌ నిర్మించుకున్నాక..మరొక రంగంలోకి వెళ్లాంటే అంత ఈజీకాదు. పైగా ఆర్థిక బాధ్యతలు, మళ్లీ మెదటి నుంచా అనే భయంతో అంత సులభంగా సాహసం చేయలేరు. కానీ అలాంటి ధైర్యం చేసి అనుకున్నది సాధించడమే కాదు..నేర్చుకోవడానికి ఎప్పటికీ ఆలస్యం అనేది ఉండదని నిరూపించింది. ఏ వయసులోనైనా సరే నేర్చుకోవాలనే ఆసక్తి, తపన బలంగా ఉంటే అదేమంత కష్టం కాదని ప్రూవ్‌ చేసిందామె. ఎవరామె అంటే..

ఆ మహిళే జాన్హవి అజిత్‌రావు. ఆమె కథను వికాస్ అల్విస్అ అనే యూజర్‌ నెట్టింట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అతడు పోస్ట్‌లో..మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పుట్టి పెరిగిన జాన్హవి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్ డియాగో నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా నుంచి మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆమె అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో పనిచేసిన తర్వాత, 2002లో తన భర్తతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు. 

అక్కడ నుంచి బెంగళూరుకు మారిన తర్వాత, జాన్హవి రక్షణ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో తన సొంత కంపెనీని ప్రారంభించడానికి ముందు చాలా ఏళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. అప్పటికే ఆమె ఒక అద్భుతమైన వృత్తి జీవితాన్ని నిర్మించుకున్నారు కూడా. అయితే ఊహించని ఆరోగ్య సమస్యలు ఆమె దృక్పథాన్ని మార్చేశాయి. 2003లో రావుకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. 

ఆమె చికిత్స పొందుతున్న సమయంలో, రోగుల జీవితాలపై వైద్యులు చూపే ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసింది. దాంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంజనీరింగ్‌ కెరీర్‌ను సైతం వదులుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అలా జాన్హవి 40 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్‌ చేయడానికి 2013లో బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్యా మెడికల్ కాలేజీలో చేరారు. దశాబ్దాల పాటు కార్పొరేట్ ప్రపంచంలో గడిపిన తర్వాత మళ్లీ స్టూడెంట్‌ లైఫ్‌ లీడ్‌ చేయడం అంత ఈజీ కాదు. 

 

కానీ ఆమె ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతూ..ఆస్ప‍త్రులలో శిక్షణ పొందడం మొదలుపెట్టింది. అలాగే తన సహా విద్యార్థులతో సమానంగా ముందుకు సాగింది. అయినప్పటికీ ఆమె లక్ష్యానికి కట్టుబడే ఉండటం విశేషం. ఏళ్ల తరబడి పట్టుదల తర్వాత ఎంబీబీఎస్‌ డిగ్రీని పూర్తిచేసి..డాక్టర్‌ మారింది. 

చివరికి తిరిగి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఆమె ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్‌గా పనిచేస్తూనే ఎండీ(MD) చేస్తోందని రాసుకొచ్చారు  పోస్ట్‌లో. ఇక్కడ జాన్హవి కథతో మనల్ని మంన ఆవిష్కరించుకోవడానికి జీవిత కలను సాకారం చేసుకోవడానికి ఎప్పటికీ ఆలస్యం కానే కాదని నిరూపితమైంది కదూ..!. 

(చదవండి:  దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌..! ఎక్కడంటే..)

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)