Breaking News

10 కేజీల బంగారంతో డ్రెస్‌..! ఎక్కడంటే..

Published on Sun, 09/28/2025 - 15:14

బంగారం రేటు ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...

సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. 

దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్‌ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్‌ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. 

ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్‌ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్‌ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్‌ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్‌ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్‌ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. 

ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్‌లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్,  పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.

(చదవండి: అందరికీ ఒకటే రక్తం!)

 

#

Tags : 1

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)