Breaking News

మామ్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..

Published on Thu, 07/16/2026 - 10:50

వెయిట్‌లాస్‌ ఒక్కోక్కరూ ఒక్కో విధానం అనుసరిస్తూ బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవడమే కాదు దాన్ని అదుపులో ఉంచుకునేలా మెయింటైన్‌ చేయడమే అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అనుగుణంగా, నిలకడైన జీవనశైలితో నిధానంగా బరువు తగ్గడం అన్ని విధాల మేలు అని అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మామ్‌ అనుసరించి ఏకంగా 32 కిలోలు తగ్గింది. అంతేగాదు అందుకోసం తాను ఏమి అనుసరించిందో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చసుకుంది. మరి అవేంటో చూద్దామా.!.

శాన్ డియాగోకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్, తానియా అనే పిల్లల తల్లి వెయిట్‌లాస్‌ జర్నీ ఇది. ఆమె 103 కిలోల నుంచి 71 కిలోలకు తగ్గిన జర్నీని షేర్‌ చేసుకుంది. అంతలా 32 కిలోలు తగ్గడానికి సులభమైన నిలకడైన అలవాట్లే కారణమని అంటోంది. 

తాను ప్రధానంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడంపై దృష్టిసారించానని అంటోంది. మూడేళ్లలో దీన్ని సాధించానని పేర్కొంది. తాను వెయిట్‌ట్రైనింగ్‌, యోగ ద్వారా బరువు తగ్గినట్లు పోస్ట్‌లో తెలిపింది. ఇంట్లోనే సులభంగా బరువు తగ్గాలంటే ఐదు పనులు చేయాలని వెల్లడించింది. అవేంటంటే..

ప్రోటీన్
రోజుకు 3 సార్లు కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడమే  లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ప్రాసెస్ చేసిన ప్రోటీన్ల కంటే..సహజసిద్ధమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. బరువు తగ్గాలనుకుంటే రోజుకి శరీరానికి తగినంత ప్రోటీన్‌ మస్ట్‌ అని అంటోందామె.

వ్యాయామంలో సౌలభ్యం..
ఒక తల్లిగా, ఖచ్చితమైన' వ్యాయామ సమయం కోసం వెతకడం మానేశాను. కొన్ని రోజులు ఉదయం 5 గంటలకు, కొన్ని రోజులు నా బిడ్డ నిద్రపోతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు, మరికొన్ని రోజులు అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు కూడా వ్యాయామం చేశానని  ఆమె చెప్పుకొచ్చింది. తన ఉద్దేశ్యంలో క్రమంతప్పకుండా చేయగలిగే సమయమే ఉత్తమమైన వ్యాయామ సమయం అని చెబుతోందామె. కచ్చితమైన షెడ్యూల్‌ అంటూ టై వేస్ట​ చేయొద్దని హెచ్చరించింది. జీవితానుగుణంగా కదలికలు ఉండేలా చూసుకోవడమే ముఖ్యం అని అంటోందామె. 

బరువులు ఎత్తడం
తమకు సాధ్యమైనంత బరువును ఎత్తాలి. వారానికి 3 సార్లు బరువులు ఎత్తాలి. తక్కువ బరువుతో ప్రారంభించండి, క్రమబద్ధతను పెంచుకోమని చెబుతోంది. అలాగే పూర్తి శరీర వ్యాయామాలపై దృష్టి పెట్టండి, నెమ్మదిగా బరువులను పెంచుతూ పోవాలని సూచించింది.

శరీరానికి తగినంత నీరు..
హైడ్రేటెడ్‌గా ఉన్నారని నిర్ధారించుకోండి. రీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఉదాహరణకు:బరువు 120 పౌండ్లు అయితే, రోజుకు 60 ఔన్సులు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండటం శక్తికి, కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది, అలాగు అత్యుత్తమ పనితీరును కనబరచడానికి సహాయపడుతుంది.

నిద్ర
వీలైనంత నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. ప్రసవానంతర దశలో ఉంటే, కొన్ని రాత్రులు పరిపూర్ణంగా ఉండకపోవచ్చని అయినప్పటికీ ఫర్వాలేదని అంటోందామె. అలాంటి తల్లులు వీలైనప్పుడల్లా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే కోలుకోవడం, కొవ్వు తగ్గడం, కండరాల నిర్మాణం, మొత్తం ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి.

ఇలా కనీసం ఆరు నుంచి 12 వారాల పాటు ప్రయత్నించి చూస్తే..కచ్చితంగా మనలోని మార్పు మనమే స్వయంగా చూస్తామని నమ్మకంగా చెబుతోంది. అంతేగాదు ఇలా క్రమంతప్పకుండా చేస్తే..ఆలోచనా విధానంలో మార్పు తోపాటు శరీరం కూడా బలంగా మారడాన్ని చూస్తామని అంటోంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: అత్యంత క్లిష్టమైన అరుదైన కణితిని విజయవంతంగా తొలగించిన వైద్యులు)

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)