Breaking News

కేరళ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’

Published on Tue, 06/03/2025 - 11:16

కేరళలోని వయనాడ్‌ జిల్లా అంబలవాయల్‌కు చెందిన అజి థామస్‌ (AjiThomas) కూరగాయలు, అరటి, రబ్బరుతో పాటు వరిని పండిస్తారు. రైతులు తగిన ఆదాయం లేక వరి సాగు మానుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో బయో స్లర్రీతో వరి విత్తనాల ‘పెల్లెటైజేషన్‌’  (pelleting technique ) పద్ధతిని ఆయన అభివృద్ధి చేశారు. విత్తనం చుట్లూ మట్టిని లేపనం చేస్తే వాటిని విత్తన గుళికలు అనొచ్చు. ఇది అలా కాదు. నాలుగు పలకలుగా ఉండే పేడ తదితర పోషకాలతో కూడిన బిళ్లలో వరి విత్తనం పెంచి, నాట్లేస్తారు. కాబట్టి ‘విత్తన బిళ్లలు’ అని చెప్పుకుందాం. 

కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి బయో స్లర్రీలోని సూక్ష్మజీవులు పొలం మట్టిలోని పోషకాలను విచ్ఛిన్నం చేసి వరి మొక్కలకు అందించటంతో రెట్టింపు దిగుబడి వస్తున్నదని వారు తెలిపారు.  ఈ పద్ధతిలో హెక్టారుకు 5.5–6 టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని, వయనాడ్‌ ప్రాంతంలో సాధారణ పద్ధతిలో వచ్చే ధాన్యం దిగుబడితో పోల్చితే రెట్టింపని థామస్‌ తెలిపారు. కూలీల ఖర్చు 25 శాతానికి తగ్గింది. ప్రతి కుదురుకు 50–60 పిలకలు వస్తున్నాయి. కంకి పొడవు పెరిగింది. ఎకరానికి వరి విత్తనాల అవసరం 30–50 కిలోల నుంచి 2.5–5 కిలోలకు తగ్గింది. పంట 15–20 రోజులు ముందే కోతకు వస్తోందని అజి థామస్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ

విత్తన బిళ్లల తయారీ ఖర్చు ఎంత?
హెక్టారుకు సరిపడా వరి విత్తన బిళ్లల తయారీకి 12–14 కిలోల బయో–స్లర్రీ అవసరం. దీనికి హెక్టారుకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇది సాధారణ రసాయనిక సాగు పద్ధతిలో ఎరువులు, ఇతర ఉత్పాదకాల సగటు ఖర్చు కంటే రెట్టింపు. అయినప్పటికీ, కూలీల అవసరం/ఖర్చు, విత్తనాల ఖర్చు తగ్గి ధాన్యం దిగుబడి రెట్టింపు కావటంతో ఈ పద్ధతిలో వరి సాగు లాభదాయకంగా మారిందని థామస్‌ వివరించారు.

ఇదీ చదవండి: ‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా!
 

ప్రభుత్వ ప్రోత్సాహం
కేరళ ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఈ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. దీంతో, ఈ పద్ధతి కేరళలో రైతుల ఆదరణ పొందుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అజి థామస్‌ చెబుతున్నారు. 

‘విత్తన బిళ్ల’ అంటే? తయారీ ఎలా?
వరి విత్తనాలను ట్రేలలోని చిన్న చిన్న చతురస్త్రాకారపు గదుల్లో బయో స్లర్రీని నింపి, అందులో వరి విత్తనం పెట్టి, మొలకెత్తిస్తారు. ఆ తర్వాత పొలంలో నాట్లు వేసే పద్ధతి ఇది. ఆవుపేడ, పులియబెట్టిన ఆకుల ద్రావణం, పంచగవ్య, ద్రవ జీవామృతంతో పాటు సూడోమోనాస్, అజోస్పిరిల్లమ్‌ వంటి జీవన ఎరువులు కలిపి బయో–స్లర్రీ మిశ్రమాన్ని తయారు చేస్తారు. బల్ల మీద ఉంచిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ట్రేలో లేదా సాధారణ బోలు రబ్బరు మ్యాట్‌లో 1–1.5 అంగుళాల లోతు/పొడవు/వెడల్పుతో నలుచదరంగా ఉండే గుంతల్లో బయో స్లర్రీని పోసి, అందులో వరి విత్తనాలను గుచ్చుతారు. ఒక రోజులో ఆ స్లర్రీ గట్టిపడి విత్తన బిళ్లలు తయారవుతాయి. ఆ తర్వాత ట్రే నుంచి విత్తనంతో కూడిన ఆ బిళ్లలను బయటకు తీసి 12 గంటలు ఎండబెడతారు. ఆ తర్వాత వాటిపై నీరు చిలకరిస్తారు. 3 రోజుల్లో వరి మొలకలు బయటకు వచ్చి, తగినంత ఎత్తు పెరిగిన తర్వాత, ఆ బిళ్లతో కూడిన వరి నారును దమ్ము చేసిన పొలాల్లో మనుషులతో వరుసలుగా నాటుతారు. వరుసల మధ్య 25 సెం.మీ. (పది అంగుళాలు) దూరం పెడుతున్నారు. ఎకరానికి ఇట్లాంటి వరి నారు బిళ్లలు 64 వేలు అవసరమవుతాయి. ఇదే ప్యాడీ సీడ్‌ పెల్లెటైజేషన్‌ పద్ధతి

చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది
 

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)