Breaking News

ఈ మొక్కే ఒక ఎరువుల ఫ్యాక్టరీ!

Published on Tue, 01/20/2026 - 06:08

రైతును ఎటువంటి ఎరువూ అడగకపోగా.. తనే పోషకాల పంట పండించి ఇచ్చే అత్యంత అరుదైన, ఎన్నో సుగుణాలున్న అద్భుతమైన మొక్క ‘కాంఫ్రే’. బోరేజ్‌ కుటుంబం. సింఫిటమ్‌ జాతి. యూరప్, ఆసియాలకు చెందినది.  ఆ ప్రాంతం అంతటా 40 జాతులు నమోదయ్యాయి. ఇంగ్లండ్‌లో దీనిపై ఇద్దరు వ్యక్తులు విస్తృతంగా పరిశోధనలు చేశారు.

రెండు అడవి కాంఫ్రే జాతుల సంకరంతో ‘రష్యన్‌ కాంఫ్రే’ (సింఫిటమ్‌ అప్లాండికమ్‌) హైబ్రిడ్‌‡జాతి రూపొందింది. ఈ మొక్కల విశిష్ట ప్రయోజనాలను తొలుత గుర్తించిన వ్యక్తి హెన్రీ డబుల్‌డే (1810–1902). అతను ఈ మొక్కను ఆహారం, పశువులు, కోళ్ల మేత పంటగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన తర్వాత లారెన్స్ డి హిల్స్‌ (1911–1991) ఆ కృషిని కొనసాగించారు. 1950వ దశకంలో ఇంగ్లండ్‌లోని బోకింగ్‌ అనే గ్రామంలో కాంఫ్రే పరిశోధన కేంద్రంలో 21 రకాల కాంఫ్రే జాతులపై హిల్స్‌ ప్రయోగాలు చేశారు. పోషకాలు అధికంగా ఉండే మేలైన రకాన్ని గుర్తించి ’బోకింగ్‌ 14 కాంఫ్రే’ అని పేరు పెట్టారు. 
  
ఎన్‌పీకే ఎరువులతో కూడిన ఆకులు
చిన్న దుంప తెచ్చి ఒక్కసారి నాటితే చాలు.. కనీసం పదేళ్లు వేగవంతంగా పెరుగుతూ ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆకులను ‘కాంఫ్రే’ మొక్క నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కాంఫ్రే ఆకుల్లో నత్రజని, ఫాస్ఫరస్, ఫాస్ఫేట్‌ (ఎన్‌పీకే ఎరువులు) పుష్కలంగా ఉండటం విశేషం. ఈ మొక్క పెద్ద మొత్తంలో ఆకులను ఉత్పత్తి చేస్తుంది. 20–25 రోజులకోసారి పోషకాలతో నిండిన ఆకులు కోతకు వస్తూనే ఉంటాయి. కోసిన ప్రతిసారీ మొక్క మళ్లీ వేగంగా పెరుగుతుంది. అందుకే దీన్ని ‘డైనమిక్‌ న్యూట్రియంట్‌ ఎక్యుములేటర్‌’ అని పిలుస్తారు. మల్చింగ్‌ పచ్చిరొట్ట ఉత్పత్తికి ఇది అద్భుతమైన వనరు.

ఇదీ చదవండి: మంచులో రీల్స్‌..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్‌ వీడియో

16–18 సార్లు ఆకుల కోత
మొక్కలకు ఎంత బాగా నీరు పోసి పోషిస్తారు అనే దానిపై ఆధారపడి సంవత్సరానికి 16 నుంచి 18 సార్లు కత్తిరించవచ్చని కాంఫ్రే మొక్కల పెంపకంలో అనేక దశాబ్దాల అనుభవం గల ప్రముఖ పర్మాకల్చరిస్టులు కొప్పుల నరసన్న, పద్మ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తోటల్లో ప్రతి పండ్ల చెట్టు పక్కన ఈ మొక్క నాటితే చాలన్నారు. కాంఫ్రే వేర్లను కొన్ని అడుగుల లోతు వరకు చొప్పిస్తుంది. రెండు మీటర్ల లోతు వరకు దీని వేర్లు వెళ్తాయట. ఇతర మొక్కలకు అందనంత లోతు నుంచి పోషకాలు కాంఫ్రే ఆకుల ద్వారా నేలపైకి వస్తాయి. ఈ ఆకులను మల్చింగ్‌గా వేయటం లేదా కంపోస్టుగా మార్చి పంటలకు వేయటం ద్వారా ఆ పోషకాలు ఇతర పంటలకు అందించవచ్చు. కాంఫ్రే ఆకులను పొడి చేసి కూరగాయ మొక్కలు, పండ్ల చెట్లకు వేయొచ్చు. పచ్చి ఆకులను నేరుగా ఆచ్ఛాదనగా వేసుకోవచ్చు లేదా కాంఫ్రే ఆకులను తరిగి నీటిలో అనేక వారాల పాటు ఊడబెట్టి ద్రావణాన్ని తయారు చేసి వాడుకోవచ్చు.

ఎండ, నీడ, నీరు ఉండాలి
ఏ రకమైన నేలల్లో అయినా కాంఫ్రే పెరుగుతుంది. అయితే, తేమ ఆరిపోకుండా ఉండే సారవంతమైన నేలలకు అనువైనది. పీహెచ్‌ 6.5–8.5 మధ్య ఉండాలి. 6–7 మధ్య పీహెచ్‌ ఉన్న నేలల్లో ఇది బాగా పెరుగుతుందని చెబుతున్నారు. మన ఉష్ణమండలంలో ఇది పెరగాలంటే పాక్షికంగా చెట్టు నీడ అవసరం. కొంతసేపు ఎండ కూడా అవసరమే. అదేమాదిరిగా నీటి తేమ నిరంతరం ఉండేలా చూసుకోవాలి అని నరసన్న, పద్మ తెలిపారు. కూరగాయ తోటలు, పండ్ల తోటలు, కలప తోటల్లో సాళ్ల మధ్య కాంఫ్రేని నాటుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకునే కాంఫ్రే వంగడాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాటిని గుర్తించి మన దేశంలోకి దిగుమతి చేసి, రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ఉపయోగకరం.

పశుగ్రాసంగానూ పనికొస్తుంది 
కాంఫ్రే ఆకులను పశుగ్రాసంగా సుదీర్ఘ కాలంగా ఉపయోగిస్తున్నారు. లారెన్స్ డి హిల్స్‌ ఈ అంశంపై పుస్తకాలు రాశారు. తాజా ఆకులను పందులు, గొర్రెలు, కోళ్లు ఇష్టంగా తింటాయి. కానీ పశువులు, కుందేళ్ళు, గుర్రాలు వాడిపోయిన ఆకులను మాత్రమే తింటాయని హిల్స్‌ పేర్కొన్నారు. ఈ మొక్కకు గంట ఆకారంలో పువ్వులు పూస్తాయి. అనేక జాతుల తేనెటీగలు, కందిరీగలు, సాలె పురుగులు ఇతర మిత్ర పురుగులకు ఈ మొక్కలు ఆవాసం కల్పిస్తాయి. బూజు తెగులును నివారించడానికి కాంఫ్రే ఆకుల ద్రావణాన్ని ఉపయోగించవచ్చని పరిశోధన సూచిస్తుంది. ఇంగ్లండ్‌లో ఒక పర్మాకల్చరిస్టు అంచనా ప్రకారం.. అక్కడి వాతావరణంలో మొక్కకు 5.5 కిలోల బరువైన ఆకులను ఒక ఏడాదిలో కోసుకోవచ్చు. 10 మీటర్ల పొడవు 4 అడుగుల వెడల్పు గల ఎత్తు మడిలో అడుగు– అడుగున్నర దూరంలో 52 మొక్కలు వేస్తే ఏడాదిలో 286 కిలోల ఆకు వస్తుంది. ఈ ఆకు ద్వారా పొటాషియం 2.08 కిలోలు, నత్రజని 104 కిలోలు సమకూరుతుందని అంచనా. వాతావరణాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి ఇది మారుతుంది. 

విరిగిన ఎముకలను కట్టుకునేలా చేసే ఔషధ గుణాలు కాంఫ్రే ఆకుల్లో ఉన్నాయి. ఈ ఆకులను మనుషులు కూడా గతంలో తినేవారు. నొప్పులు తగ్గుతాయని కషాయం తాగేవారు. అయితే, లివర్‌పై దుష్ప్రభావం ఉంటుందని 20 ఏళ్ల క్రితం పరిశోధనల్లో తేలింది.

ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్‌ సిరప్‌ బ్యాన్‌

అత్యంత అరుదైన మొక్క కాంఫ్రే
కాంఫ్రే అరుదైన అద్భుత మొక్క. భూసారం పెంపొందించ­టా­నికి చా­­లా బాగా ఉపయోగపడుతుంది. కోళ్లు ఈ ఆకులను ఇష్టంగా తింటా­యి. విరిగిన ఎముకలను కట్టించటానికి కూడా ఇది ఉపయోగమే. చలి దేశాల నుంచి తీసుకొచ్చి 1987 నుంచి కాంఫ్రే మొక్కలను గత ఏడాది వరకు పెంచాం. ఆదిలాబాద్‌ దగ్గర మా పొలంలో ఒక ఎకరంలో పూర్తిగా కాంఫ్రే ఉండేది. మన వాతావరణానికి ఈ మొక్క అల­వాటు పడింది.  చాలామంది రైతు­లకు ఇచ్చాం.  చాలామంది రైతు­లకు ఇచ్చాం. అయితే, మేం వేరే పనిలో ఉండి ఒక సంవత్సరం అంత­గా శ్రద్ధ పెట్టలేదు. మొక్కలన్నీ చనిపోయాయి. కాంఫ్రే మొక్కల ఆ­కులు నేలపై మల్చింగ్‌ చేసేవాళ్లం. ఆకులతో ద్రావణం తయారు చేసి కూరగాయలు, పండ్ల చెట్ల పోషణ కోసం వాడేవాళ్లం. కంపోస్టులో వా­డేవాళ్లం. 6–7 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఏడాదికి 16–18 సార్లు ఆకులను కత్తిరించి వాడుకోవచ్చు. అల్లం మాదిరిగా దీనికి పాక్షి­కంగా ఎండ, నీడ కావాలి. నీరు రోజూ ఇవ్వాలి. పావెకరంలో 500 మొక్కలు పెట్టొచ్చు. పండ్ల చెట్లకు పక్కనే పెరుగుతూ పోషకాలు అందించే నర్స్‌ ప్లాంట్‌గా కాంఫ్రే పనికొస్తుంది. ఆకు గరుకుగా నూగుతో కూడి ఉండటం వల్ల అతి త్వరగా 3 రోజుల్లోనే కుళ్లి మట్టిలో కలిసి­పోతుంది. మనుషులకే కాదు పశువులకూ బోన్‌సెట్టర్‌గా ఉపయోగ­పడు­తుంది. వ్యవసాయా నికి, పశుపోషణకు ఎన్నో విధాలుగా ఉప­యో­గపడే ఈ మొక్కలను ప్రభుత్వం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి దేశాల నుంచి తెప్పించాలి. మన వాతావరణానికి సరిపడే కాంఫ్రే జాతులను దిగుమతి చేసుకొని రైతులకు అందించాలి. మన దేశంలో కూడా ఇటువంటి లక్షణాలున్న మొక్కలు ఉండే ఉంటాయి. మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి.
 

చేపలు ఇవ్వటం కన్నా చేపలు పట్టటం నేర్పితే ఎక్కువ మేలు జరుగుతుందన్నది నానుడి. అదే విధంగా రసాయనిక ఎరువులను రైతులకు ఇవ్వటానికి బదులు  ‘ఎరువుల ఫ్యాక్టరీ’ వంటి అద్భుత మొక్కలను రైతులకు ఇస్తే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ఆ విదేశీ మొక్క పేరే ‘కాంఫ్రే’! 

చిన్న దుంప తెచ్చి ఒక్కసారి నాటితే చాలు.. కనీసం పదేళ్లు వేగవంతంగా పెరుగుతూ ఎన్‌పీకే ఎరువులతో కూడిన ఆకులను ‘కాంఫ్రే’ మొక్క నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఆకులు 20–25 రోజులకోసారి కోతకు వస్తూనే ఉంటాయి. అందుకే దీన్ని ‘డైనమిక్‌ న్యూట్రియంట్‌ ఎక్యుములేటర్‌’ అంటారు 

పంటలు, పండ్ల తోటల్లో గడ్డి పెరగకుండా పోషకాలను పండించే కవర్‌ క్రాప్‌గా పెంచుకోవచ్చు. ఆకులు కోసి ఆచ్ఛాదనగా వెయ్యొచ్చు. ఆకులను ఊరబెట్టి ద్రావణాన్ని  గ్రోత్‌ ప్రమోటర్‌గా వాడొచ్చు

పశువులకు, కోళ్లకు, పందులకు పోషకవంతమైన మేతగానూ కాంఫ్రే ఆకులు ఉపయోగపడతాయి 

జహీరాబాద్‌కు చెందిన పర్మాకల్చరిస్టులు నర్సన్న, పద్మకు ‘కాంఫ్రే’ సాగులో అనుభవం ఉంది 

కాంఫ్రే మొక్కల నుంచి ఏడాదికి 16–18 సార్లు ఆకులు కోసుకోవచ్చన్నారు 

ప్రభుత్వం రసాయనిక ఎరువులకు బదులు అద్భుతమైన ఈ మొక్కను ఇంగ్లండ్‌/ ఆస్ట్రేలియా నుంచి తెప్పించి ఇస్తే మేలని సూచిస్తున్నారు

– కొప్పుల నరసన్న, పద్మ, సహ వ్యవస్థాపకులు, 
అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ, జహీరాబాద్‌ 
మొబైల్‌: 94408 26722

Videos

నీ అబ్బా సొమ్ము అనుకుంటున్నావా? లోకేష్ పై నిప్పులు చెరిగిన సతీష్ రెడ్డి

చంద్రబాబుపై కేసులు ఎందుకు కొట్టేశారు? హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వేలం పాటలు

CPM Leaders: అయ్యా బాబు .. ఎడ్జోలము కాదు .. ఎదురుతిరుగుతాము

MLA Vivekananda: రాజకీయ కక్ష సాధింపే..!

కృష్ణా జిల్లా గుడివాడలో లిక్కర్ సిండికేట్ దందా

ఫోన్ ట్యాపింగ్‌తో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

కొరియన్ కనకరాజు గా వరుణ్ తేజ్ టీజర్ మామూలుగా లేదుగా

ధనుష్ - మృణాల్ ఠాకూర్ పెళ్లి.. అసలు నిజం ఎంత..?

లోకేష్ కు బ్యాక్ ఎక్కువ.. మైండ్ తక్కువ.. లోకేష్ లింగం పై అమర్నాథ్ పంచులు

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

వాఘా బోర్డర్‌లో 'ధురంధర్' బ్యూటీ (ఫొటోలు)

+5

సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న పూజిత పొన్నాడ -ఎంత బాగుందో! (ఫొటోలు)

+5

అల్లు అర్జున్ ఫ్యామిలీ.. జపాన్ ట్రిప్‌లో ఇలా (ఫొటోలు)

+5

టిల్లుగాని పోరీ.. మతిపోయే గ్లామరస్‌గా (ఫొటోలు)

+5

'శుభకృత్ నామ సంవత్సర' మూవీ ఈవెంట్‌లో పవిత్ర, నరేష్‌ (ఫోటోలు)

+5

టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

నటుడు నరేష్ బర్త్‌డే స్పెషల్‌.. పవిత్రతో అనుబంధం (ఫోటోలు)

+5

కొమురవెల్లి : అగ్నిగుండంపై ఉత్సవ విగ్రహాలతో పూజారులు (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)