Breaking News

ఐదడుగుల  అరటి!

Published on Tue, 12/23/2025 - 06:33

తుపాను గాలులకు అరటి చెట్లు విరిగి పడిపోవటం అనేది రైతును ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే పరిస్థితి. ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉపయోగపడే పొట్టి రకం అరటి  ‘కావేరి వామన్‌’ అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్‌), తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌ – ఎస్‌ఆర్‌సీబీ) సంయుక్తంగా  ఈ సరికొత్త అరటి రకాన్ని రూపొందించాయి. విస్తారంగా సాగులో ఉన్న గ్రాండ్‌ నైన్‌ (జీ9) అరటి చెట్టు ఎత్తు 6–8 అడుగులు. దీని పంట కాలం 11–12 నెలలు. అయితే, గాలులకు ఇది ఒరిగిపోతుంది లేదా విరిగిపోతుంది. 

ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఊత కర్రలను సైతం రైతులు అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జీ9 అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో పొట్టి అరటి ‘కావేరి వామన్‌’ రకాన్ని రూపొందించటం విశేషం. ఈ చెట్టు ఎత్తు 4.9 అడుగుల నుంచి 5.25 అడుగులు (150 నుంచి 160 సెం.మీ.. (59–63 అంగుళాల) పెరుగుతుంది. గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తు ఉండే గెలలో 8–10 పండ్ల హస్తాలు ఉంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. రైతులు పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగు చెయ్యటానికే కాకుండా.. ఇంటిపంటలకు, టెర్రస్‌ గార్డెనింగ్‌ చేసే వారికి కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.

రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, దేశ ఆహార/ పౌష్టికాహార భద్రతకు దోహదపడేందుకు ట్రోంబే బనానా మ్యూటెంట్‌–9 (టీబీఎం–9) పొట్టి అరటి రకాన్ని అభివృద్ధి చేశామని బార్క్‌ తెలిపింది. టీబీఎం–9నే ఇటీవల భారత ప్రభుత్వం ’కావేరి వామన్‌’ పేరుతో నోటిఫై చేసింది. కావేరి వామన్‌ దేశంలోని మొట్టమొదటి మ్యూటెంట్‌ అరటి రకం మాత్రమే కాదు,  బార్క్‌ అభివృద్ధి చేసి విడుదల చేసిన మొదటి పండ్ల జాతి కూడా కావటం విశేషం. కావేరి వామన్‌తో బార్క్‌ విడుదల చేసిన మెరుగైన పంట రకాల సంఖ్య 72కు చేరుకుంది.

అయోనైజింగ్‌ రేడియేషన్‌ ద్వారా దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే కృషిలో కావేరి వామన్‌ విడుదల ఒక ప్రధాన అడుగు అని అణుశక్తి విభాగం కార్యదర్శి, అణుశక్తి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అజిత్‌ కుమార్‌ మొహంతి ప్రశంసించారు.

బార్క్‌ డైరెక్టర్‌ వివేక్‌ భాసిన్‌ మాట్లాడుతూ, స్థిరమైన వ్యవసాయానికి కీలకమైన కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంలో గామా కిరణాల ప్రేరేపిత మ్యూటాజెనిసిస్‌ కీలక పాత్రను పోషించిందన్నారు. గ్రాండ్‌ నైన్‌ అరటిని పండించే రైతులకు కావేరి వామన్‌ విడుదల ఒక వరం వంటిదన్నారు. 

బార్క్‌ రూపొందించిన ఈ కొత్త రకంపై తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ బనానా అనేక సంవత్సరాల పాటు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించింది. కఠినమైన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత మాతృరకం అయిన జీ9 రకం కంటే కావేరి వామన్‌ అనేక మేలైన ఫలితాలనిచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

పొడవుగా పెరిగే జీ9 రకం అరటి మొక్కలతో గాలుల తీవ్రత ఉండే ప్రాంతాల్లో రైతులు పెద్ద నష్టాలపాలవుతున్నారు. ఒరిగిపోకుండా, విరిగిపోకుండా చెట్లను కాపాడుకోవటానికి వెదురు లేదా సర్వి బాదులను ఆసరాగా పెడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. గాలులకు తట్టుకొని నిలబడే శక్తిగల కావేరి వామన్‌ కొత్త రకం పొట్టి వంగడంతో ఈ సమస్య తీరిపోతుంది. కావేరి వామన్‌ చెట్ల గెలలు ఒకటిన్నర నెలల ముందే కోతకు వస్తాయి. దీని అరటి పండు గ్రాండ్‌ నైన్‌ రకం అరటి పండ్ల మాదిరిగానే రుచిగా, నాణ్యంగా ఉంటాయి.


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)