Breaking News

అర్జున్‌ టెండూల్కర్‌ పెళ్లిలో కుందనపు బొమ్మలా సారా..!

Published on Fri, 03/06/2026 - 10:54

సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ సానియా చందోక్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు క్రికెట్‌ దిగ్గజాల నుంచి బాలీవుడ్‌ తారలు, పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తమ్ముడి పెళ్లిలో అక్క సారా కుందనపు బొమ్మలా మెరిసింది. మొత్తం వేడుకలో సారా లుక్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయతను ఆధునికతను కలగలసిన స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది. సింపుల్‌గా చెప్పాలంటే దివి నుంచి భువికి వచ్చిన దేవతాలో అత్యద్భుతంగా ఉంది సారా. తల్లి అంజలి సైతం గులాబీ రంగు చీరనే ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సారా, అంజలీలు పెళ్లి వేడుకలో ధరించిన చీరలు, ఆభరణాల స్పెషాల్టీ గురించి సవివరంగా చూద్దామా..!.

సారా తన తమ్ముడి పెళ్లి వేడుక కోసం పింక్‌ బంధానిని ఎంచుకుంది. అద్భుతమైన జర్దోజి రేషమ్‌ ఎంబ్రాయిడరీకి తగ్గా కట్‌వర్క్‌ రోసెట్‌ బోర్డర్‌. జ్యువెల్డ్‌ టాసెల్స్‌తో డెకరేట్‌ చేసిన హాట్‌పింక్‌ సిల్క్‌ బ్లౌజ్‌తో మరింత అందంగా కనిపించింది. ఆ చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్‌ అత్యంత హైలెట్‌గా కనిపించడమే గాక ఆ శారీ అందాన్ని రెట్టింపు చేసింది. 

ఆ చీరకు దగ్గ భారీ సాంప్రదాయ ఆభరణాలు సారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆకుపచ్చ పూసల బహుళ స్టెప్స్‌ ఎంబెడెడ్‌ నెక్లెస్‌, మ్యాచింగ్‌ చెవిపోగులు, పాపిడి బొట్టు, ఆమె లుక్‌ని మరింత హైలెట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే మేకప్‌ కూడా చాలా నేచురల్‌గా కనిపించిన తీరు..సహజత్వానికి ప్రతిక సారా అని చెప్పకనే చెబుతోంది.

ఇక కూతురు సారా అందానికి తగ్గట్టుగా తల్లి అంజలి ఈ వేడుకలో రాజరికపు గులాబీ రంగు చేనేత పట్టు చీరను ఎంచుకుంది. ఆమె అత్యంత విలాసవంతమైన లగ్జరీని అంతగా ఇష్టపడరు. సచిన్‌ భార్య అంజలి ధరించిన చీరను డిజైనర్ జుహి షా రూపొందించారు. ఇక అంజలిని అందంగా తీర్చిద్దింది సెలబ్రిటీ మేకప్‌​ ఆర్టిస్ట్‌ నిషి సింగ్‌. సచిన్‌ సైతం ఆ మేకప్‌ ఆర్టిస్ట్‌ నైపుణ్యాన్ని కొనియాడారు. మీరు అంజలి లుక్‌ని చాలా అందంగా చూపించారని మెచ్చుకున్నారు. 

ఇక అంజలీ కూడా మేకప్‌ ఎప్పుడూ హెవీగా ఉండకూడదని సహజత్వాన్ని అందంగా చూపిస్తే చాలని, అందుకే తాను మినిమల్‌ లైట్ మేకప్‌నే ఎంచుకుంటానని అన్నారామె. ఇక ఈ వేడుకలో సచిన్‌ క్రీమ్‌ ఎంబ్రాయిడరీ షేర్వానీలో కనిపించగా, వధువరులు అర్జున్‌ సానీయాలు ఎరుపు రంగును ఎంచుకున్నారు. అర్జున్‌ టెండూల్కర్‌ దుస్తులను  మనీష్ మల్హోత్రా, సానియా లెహంగాను తరుణ్ తహిలియానిలు రూపొందించారు. 

 (చదవండి: తొలి మహిళా తవిల్‌ కళాకారిణి..! ఏ ఆర్‌ రెహమాన్‌ సైతం..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)