Breaking News

అప్పుడు ఆశ్చర్యపరిచాయి.. ఇప్పుడు అలవాటుగా మారింది..!

Published on Sun, 07/06/2025 - 16:01

మన దేశంలో జీవించడమే మంచిది ఇక్కడే హాయిగా ఉంటుందని పలువురు విదేశీయలు భారతదేశాన్ని మెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక విదేశీయురాలు తన పిల్లలను ఇక్కడే పెంచుతానని చెప్పగా, మరొకరు ఇక్కడ జీవిస్తానని అన్నారు. ఇప్పుడు ఈ విదేశీ మహిళ ఏకంగా మన భారతీయుల అలవాట్లు నచ్చాయి, వాటికి అలవాటు పడిపోయాను అని చెబుతుండటం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టిట తెగ వైరల్‌ మారింది. మరి ఇంతకీ ఆమె అనుసరిస్తున్న భారతీయ అలవాట్లు ఏంటంటే..

బెంగళూరులో నివశిస్తున్న కంటెంట్‌ క్రియేటర్‌ యులియా అస్లమోవా అనే రష్యన్‌ మహిళ భారతీయ అలవాట్ల గురించి షేర్‌ చేసుకుంది. మొదట్లో ఆ అలవాట్లు చూసి ఆశ్చర్యపోయానని, ఇప్పుడు అవి తన దైనందిన జీవితంలో భాగమైపోయానని చెప్పుకొచ్చింది. పైగా వాటిని తాను కూడా పాటిస్తున్నానని చెప్పడం విశేషం. అందుకు సంబంధించిన మొత్తం ఎనిమిది అలవాట్లను లిస్ట్‌ ఔట్‌ చేసింది. అవేంటో వరసగా చూద్దామా..! 

ఈ అలవాట్లు వింతగా ఉన్నప్పటికీ, తన దినచర్యలో భాగమై కొండంతా సంతోషాన్ని మద్దతుని ఇస్తున్నాయని అంటోంది యులియా. ఇంతకీ అవేంటంటే..

  • అత్తమామలతో జీవించడం: ఇంటిని తాను నిర్వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదొక వరంలా భావిస్తోందామె

  • చేతులతో తినడం: ఇది ఎంతో కంఫర్ట్‌బుల్‌గా ఉందంటోంది. పైగా ఇలా తింటేనే ఆహారం రుచిగా అనిపిస్తోందట. 

  • కొంచెం ఆలస్యమైనా పట్టించుకోను: ఎవరైనా వ్యక్తులు ఆలస్యంగా వచ్చినా..అందుకు తగ్గట్టుగా తాను ఇతర పనులు ప్లాన్‌ చేసుకుంటోందట, సమస్యగా ఫీల్‌ కాలేదట. 

  • ఎక్కువ మంది పనిమనుషులు ఉండటం: ఇది చూడటానికి వింతగా అనిపించినా..ఇదేరాను రాను సౌకర్యవంతంగా, స్మార్ట్‌గా అనిపిస్తోంది

  • చర్చలు: భారతదేశం నుంచి నేర్చుకున్నది ఇదే. దీన్ని సూపర్‌ పవర్‌గా అభివర్ణించింది.

  • మసాలా చాయ్ తాగడం: ఈ టీ తనకెంతో మనశ్శాంతినిస్తుందట. దీన్ని ఆమె మంగోలియన్‌ చాయ్‌తో పోల్చారామె. 

  • ప్రేమ విలువ: భారతీయ జీవితం సినిమాలు , సంభాషణలు, ప్రేమ చుట్టూ తిరుగుతాయని చెప్పుకొచ్చింది. 

  • బహుళ భాషలు మాట్లాడటం: ఇక్కడ ఉండే బహుళ భాషలు నచ్చాయట. అలాగే త్వరలో హిందీ నేర్చుకోవాలని భావిస్తోందట.

భారతీయ జీవితంలో ప్రేమ చాలా గాఢంగా ఉంటుందని, సినిమాల్లో లేదా రోజువారీ సంభాషణలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. భారతదేశం చాలా భావోద్వేగ దేశం. అందువల్ల ఇక్కడ ప్రతీది అద్భుతంగా ఉంటుంది. యులియా పోస్ట్‌ని చూసిన నెటిజన్లు.. భారతదేశ రియల్‌ స్ఫూర్తిని తెలుసుకున్నారు, స్వీకరించారు కూడా. అలాగే అత్తమామలతో కలిసి ఉండటంపై మీ అభిప్రాయం అత్యంత హర్షాతిరేకంగా ఉందంటూ యులియాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: పేరెంట్స్‌ త్యాగాలకు ఫలితం ఏంటో చూపిస్తున్నా..! కుమారుడి భావోద్వేగం..)

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)