క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్‌ వీడియో

Published on Wed, 08/20/2025 - 14:17

రైలు ప్రయాణాల్లో  పిల్లలు, పెద్దలూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రైలు  ఎక్కేటపుడు, దిగేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు అసలు పనికి రాదు.  ప్రాణాలు ముఖ్యం అనే విషయాన్ని  అస్సలు మర్చిపోకూడదు. తాజాగా కేరళలో జరిగిన ఒక ఘటన  ఈ విషయాలను మరోసారి గుర్తు చేస్తుంది.

కేరళలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన విశేషంగా నిలిచింది. రైలు నుండి దిగడానికి ప్రయత్నించినప్పుడు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది.   దాదాపు పట్టాలపై పడిపోయింది. అక్కడనే రైల్వే ఉద్యోగి రాఘవన్ ఉన్ని తక్షణమే స్పందించారు. ఆమెను ఒడుపుగా పట్టుకొని పక్కకు లాగారు. వెంటనే అలర్ట్‌ అయ్యి శరవేగంగా ఆయన స్పందించకపోతే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ఆసీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన నెట్టింట్‌ వైరల్‌గా మారింది.   నెటిజన్లు రాఘవన్‌  చాకచక్యంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు రైల్వే సిబ్బంది అంకితభావాన్ని ప్రశంసిస్తూనే, మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని కూడా నొక్కి చెబుతుండటం గమనార్హం.

ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత


కాగా  2022లో ఇలాంటి ఘటన  ఒకటి రైలు ప్రమాదాల్లో  సిబ్బంది అప్రమత్తతను గుర్తు చేస్తూ కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్‌లో  సతీష్ అనే RPF హెడ్ కానిస్టేబుల్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన మైనర్ బాలికను రక్షించాడు. దీనికి సంబంధించిన RPF ఇండియా విడుదల చేసింది. ఈ వీడియోలో  లిప్తపాటులో  స్పందించి కానిస్టేబుల్ అమ్మాయిని  రక్షించాడు. 
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)