పాపులర్‌ యూ ట్యూబర్‌ సీక్రెట్‌ వెడ్డింగ్‌ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్‌

Published on Tue, 05/27/2025 - 14:31

ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్‌లైన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్.  అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్‌లైన్‌ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా  పెళ్లి చేసుకున్నారు. కానీ  జూన్‌లో విద్యార్థులకోసం విందు  ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది.  ప్రస్తుతం ఖాన్‌ సర్‌ పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందినఖాన్‌ సర్‌ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని  వెల్లడించారు. దీనికి  విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్‌ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న  విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును  ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్‌ సర్‌ వెడ్స్‌, ఏఎస్‌ ఖాన్‌ అని పేరున్న పోస్టర్‌ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్‌ సార్‌ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)