Breaking News

అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!

Published on Thu, 09/04/2025 - 11:04

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలికి చెందిన అమ్మాయి ఒకరు ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను’ అని అర్థరాత్రి దాటిన తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. ‘మెటా’ వెంటనే ఈ పోస్ట్‌ను స్టేట్‌ పోలీస్‌ మీడియా సెంటర్‌కు పంపి పోలీసులను అలర్ట్‌ చేసింది. 

కేవలం పదహారు నిమిషాల వ్యవధిలో ఒక సబ్‌–ఇన్‌స్పెక్టర్, కొందరు మహిళా పోలీసులు ఆ అమ్మాయి ఉన్న ఇంటికి చేరుకున్నారు. వాంతులు చేసుకున్న ఆ అమ్మాయి నిస్తేజంగా పడి ఉంది. వెంటనే ఆమెను హస్పిటల్‌కు తీసుకువెళ్లారు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి చావు నుంచి బయటపడింది. 

ఆమె కోలుకున్న తరువాత... ‘ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?’ అని అడిగితే... తాను ప్రేమించిన వ్యక్తి మాట్లాడడం మానేశాడని, తన ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేశాడని...ఇలా చెప్పుకుంటూ పోయింది. 

పెరుగుతున్న ఆన్‌లైన్‌ సుసైడ్‌ అటెంప్ట్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు, మెటా భాగస్వామ్యంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సుడైడ్‌–రిలేటెడ్‌ పోస్ట్‌లపై నిఘా పెడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్నారు. జనవరి 1, 2023 నుంచి ఆగస్ట్‌ 25, 2025 వరకు 1,315 మంది ప్రాణాలను కాపాడారు. 

(చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)