Breaking News

ఏడుపదుల వయసులోనూ చలాకీగా మోదీ.. అలా ఎలా?

Published on Tue, 09/17/2024 - 09:18

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుర్రాడిలా చురుకుగా ఉంటారు. మంచి యాక్టివ్‌గా కనిపించే ఆయనకు 74 ఏళ్లు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా ఏడు పదుల వయసులో వణుకుతూ..తడబడుతూ ఉంటారు. కానీ మన మోదీ మాత్రం పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా వేగంగా కదులుతూ పనులు చేస్తారు. ఆ వయసు వారికి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఆయన ఫిట్‌నెస్‌ పరంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య  పరంగా యువతకు ఆదర్శం ఆయన. ఇంతలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఐదు ఆరోగ్య రహస్యల గురించి సవివరంగా చూద్దామా..!

యోగా..
యోగాతో రోజుని ప్రారంభిస్తారు మోదీ. పంచతత్త్వ యోగాసెషన్‌తో అతని రోజు త్వరగా ప్రారంభమవుతుందట. ఆయన ప్రకృతిలోని ఐదు అంశాలతో ముడిపడి ఉన్న అనేక ఆసనాలను వేస్తారు. ప్రతిరోజూ సుమారు 40 నిమిషాల పాటు సూర్య నమస్కారం, ధ్యానం, ప్రాణాయామం, యోగా నిద్ర తదితరాలు తప్పనిసరి. ఇక్కడ యోగా మనస్సుని, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, పైగా శారీరక, మానసిక  ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఉపకరిస్తుంది.

 

యోగా నిద్ర లేదా సమాధి స్థితి..
ప్రధానిగా ఆయనకు ఎంత బిజీ షెడ్యూల్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువల్ల కంటినిండా నిద్ర అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ఇది ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో మనకు తెలిసిందే. అందుకోసం మోదీ యోగా నిద్ర లేదా సమాధి స్థితిలో గడుపుతుంటారు. ఇది నిద్రలేమితో పోరాడటానికి, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇద తనకు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు, శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని పలు ఇంటర్యూలలో మోదీ చెప్పుకొచ్చారు కూడా. 

తప్పనిసరిగా వాకింగ్‌..
ఎంత బిజీ షెడ్యూల్లో కూడా తప్పనిసరిగా వాకింగ్‌ చేస్తారు. అక్కడ ఉన్న వెసులబాటు రీత్యా సమయం తీసుకుని మరీ నడకకు ప్రాధాన్యత ఇస్తారు మోదీ. తాను ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తానని, అక్కడ కాసేపు గడపడం తనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అందుకోసమైనా ఆపేదే లేదని చెబుతుంటారు. పచ్చగడ్డిపై నడుస్తూ ప్రకృతితో మమేకమవ్వడం తెలియని రిఫ్రెష్‌ని ఇస్తుందని అంటారు మోదీ.

అల్పాహరం, భోజనంగా..
ప్రధాని మోదీ శాకాహారి. ఆయన నవరాత్రుల తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆఖరికీ విదేశాల్లో ఉన్నా కూడా నియమం తప్పరు. అంతేగాదు కచ్చితంగా ప్రతిరోజు తొమ్మిది కల్లా అల్పాహారం తీసుకుంటానని చాలసార్లు చెప్పారు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేందుకు ఆయా కాలానుగుణ పండ్లను కూరగాయాలను, తృణధాన్యాలను అస్సలు మిస్‌కాకుండా చూసుకుంటానని సోషల్‌ మీడియా పలుసార్లు వెల్లడించారు. అంతేగాదు ఒకసారి ఫిట్‌ ఇండియా ఉద్యమంలోతాను ములక్కాయతో కూడిన పరాఠాను తినేందుకు ఇష్టపడతానని అన్నారు. అలాగే మిల్లెట్లు, కాయధాన్యాలు, భారతీయ మసాలాలతో చేసే గుజరాతీ వాఘరేలీ ఖిచ్డీ వంటివి ఇష్టంగా తింటానని చెప్పారు. 

ఆయర్వేదానికే ప్రాధాన్యత..
మోదీకి ఆయుర్వేదంపై ప్రగాఢ నమ్మకం ఉంది. జలుబు, దగ్గు,లేదా కాలనుగుణ అలెర్జీలు వంటి ఏ అనారోగ్య సమస్యకైనా ఆయుర్వేదాన్నే ఆశ్రయిస్తారు. అలాగే ఆహారంలో సహజసిద్ధమైన నూనెలకే ప్రాధాన్యత ఇస్తారు. 

అందువల్లే తాను ఇంతలా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండగలుగుతున్నానని అన్నారు. ఈ విధానాలను పాటించడం వల్లే అలసటకు ఆస్కారం లేకుండా చురుగ్గా ఉండటమే గాక దాదాపు 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా సమర్థవంతంగా పనులు చేయగలుగుతున్నానని సగర్వంగా చెప్పారు మోదీ. 

 

(చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!)
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)