Breaking News

జనాలే లేని ద్వీపంపై పన్నులా? ట్రంప్‌ సుంకాలపై పెంగ్విన్స్‌ సెటైర్లు

Published on Fri, 04/04/2025 - 14:17

అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ  పరస్పరం (రెసిప్రోకల్ టారిఫ్స్) పన్నులు విధించడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా.  దీనిపై సోషల్‌ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరీ ముఖ్యంగా  అయితే జనావాసాలు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించిన తీరు మరింత విస్మయ పర్చింది. దీనిపై  పెంగ్విన్ మీమ్స్(penguin memes) ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవుల (Heard and McDonald Islands) పై ఎందుకు పన్నులు విధించారు అనేదే పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్-అంటార్కిటిక్ ఆస్ట్రేలియన్ ప్రాంతమైన హర్డ్ , మెక్‌డొనాల్డ్ దీవుల నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10శాతం సుంకాలను విధించారు. అయితే  ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి  వివరణ ఇచ్చారు.

వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. దాదాపు 80 శాతం మంచుతో కప్పబడిన ఈ  ప్రాంతం  యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది.  దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు, వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించటం లేదు. దాదాపు దశాబ్ధకాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్‌కు ఆవాస ప్రాంతంగా ఉంది. 

 ఓవల్‌ ఆఫీసులో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్‌ను అమెరికా అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు వాన్స్‌తో ఇటీవల జరిగిన వివాదాస్పద  సమావేశానికి ఉటింకిస్తూ ఒక మీమ్‌ ఉంది.  జెలెన్‌స్కీ ప్లేస్‌లో పెంగ్విన్‌ను ఉంచారు. మరొక మీమ్ యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్థానంలో చక్రవర్తి పెంగ్విన్‌ను చూస్తున్నట్లు ఉంది. "పెంగ్విన్‌లు సంవత్సరాలుగా మనల్ని చీల్చి చెండాడుతున్నాయి" అని  మొదిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్‌గా  11 రోజులు పనిచేసిన  ఆంథోనీ స్కారాముచ్చి వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. చమత్కరించారు. ఈ సుంకాల జాబితాలో  రష్యా  లేదనే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ. "ట్రంప్ పుతిన్‌పై కాదు పెంగ్విన్‌లపై సుంకాలను విధించారు" అంటూ అమెరికా సెనేట్ డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమర్ పోస్ట్ చేశారు,

 ;

 

చదవండి: ట్రంప్ సుంకాల మోత, సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హోరు మాములుగా లేదు!

మరోవైపు ట్రంప్‌ సుంకాల దెబ్బతో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.  2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత   మళ్లీ ఇపుడు స్టాక్స్‌ తీవ్రంగా నష్టపోతున్నాయి. 
 

 

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)