Breaking News

తాటి చెట్టుతో ఇన్ని ఉపయోగాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Published on Fri, 10/30/2026 - 09:21

తాటి చెట్టు పేరు విననివారు ఉండరు. తాటి చెట్టు ఎన్నో విలువలతో కూడినది. తమిళనాడు ప్రభుత్వం ఈ చెట్టును రాష్ట్ర చెట్టుగా గుర్తించింది . ఈ చెట్టుకు పంగలుండవు నిటారుగా పెరుగుతుంది. విత్తనం ద్వారానే దీని ప్రవర్ధనం. టిష్యుకల్చర్‌ ద్వారా కూడా చేయవచ్చు. పురాణాల్లో ఈ చెట్టుకు మంచి గుర్తింపు ఉంది. పేపరు లేనప్పుడు చేతిరాతలు తాటి ఆకులపైనే జీరిగేవి. దీన్ని ఆంధ్ర కల్ప వృక్షం అని కూడా అంటారు. ఇందులో ఇంచుమించు ఆరు ప్రజాతులు ఉన్నాయి.

English Name : Palmyra Palm
శాస్త్రీయ నామం : బొరాసస్‌ ఫ్లాబెల్లిఫర్‌

Scientific Name : Borassus flabellifer L.
Synonym (s) : Borassus flabelliformis L. Borassus sundaicus Becc. Borassus tunicatus Lour.

కుటుంబం : అరెకేసి 
Family : Arecaceae

తాటి చెట్టు పేర్లు వివిధ భాషల్లో.. 
అస్సామీ : టల్‌ 
ఇంగ్లీష్‌ : పామెర పామ్, టల్‌ పామ్, టాడి పామ్, డబీ పామ్, పైన్‌ పామ్, ఐస్‌ ఆపిల్‌
ఉర్దూ : తాడీ
ఒరియా : తల
కన్నడ : తలెమర, ఓలెగరి, తాటినిల్మ్, తలెగరి
గుజరాతీ : తాడ్‌
తమిళం : పనై
తెలుగు : తాటిచెట్టు
మరాఠీ : తడ్‌
మలయాళం : పన, కరింపన
బెంగాలీ : తాల
హిందీ : తాడ్, తృణరాజ్‌
సంస్కృతం : తలం, తంతుని యొసం, తృణం – కేతుం, తృనం – రాజ్‌.

పూత : జనవరి – ఫిబ్రవరి

పండ్లు : మే – జూలై
 
ఉనికి...
ఈ చెట్టు 15–30 మీటర్ల ఎత్తువరకు పెరగగలదు. ఎంతటిగాలి, వానలు వచ్చినా కూలిపోదు. దీనికి నిదర్శనం, వాటి వేరు వ్యవస్థ. వీటి ఆకుల ప్రత్యేకత పూర్తిగా పండిపోయినా అట్లే ఉంటుంది. ఈ చెట్లు ఉష్ణ, ఉప–ఉష్ణ మండలాలకు చెందినవి. వీటి స్వస్థలం భారత ఉపఖండం. దక్షిణ–తూర్పు ఆసియా ఖండం (చైనా). ఇతర దేశాలైన ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌ తదితర దేశాల్లో కూడా ఈ చెట్లు ఉన్నాయి.

ఉపయోగాలు...
తాటి చెట్టు ఉపయోగాలు చాలాఉన్నాయి. ఇందులో నిరుపయోగమనేదేదీ లేదు.

తాటి ఆకులు:

  • పూర్వం చేతి రాతలకు తాటి ఆకులనే ఉపయోగించారు. అనేక గ్రంథాలను తాటి ఆకులపైనే రాశారు. ఉదా.. బ్రహ్మంగారు తాటి ఆకులనే కాలజ్ఞానం రాయటానికి ఉపయోగించారు.

  • గతంలో అనేక భాషల్లో రాసినవి తాటి ఆకులపైనే. ఇప్పటికీ ఈ గ్రంథాలను భద్రపరచారు.

  • గుడిసెలపై కప్పుకు తాటి ఆకులను వాడతారు.

  • చాపలను, బుట్టలను, ఫ్యాన్స్‌, టోపిలను, గొడుగులను, బెల్లం ముద్దలపై కప్పటానికి మ్యాట్సు, మొదలగు వాటి తయారీలో తాటి ఆకులను వాడతారు.

  • మానును రెండుగా చీల్చి దూలాలు, వాసాలు, రాప్టర్లుగా వాడతారు. చాలా గట్టిగా ఉంటాయి. నానకుండా ఉంటే వంద సంవత్సరాలు ఉంటాయంటారు.

  • మట్టలను వంట చెరుకుగా వాడతారు.

  • తాటి మానును కాలువలపై అడ్డంగా వేసి వంతెనగా వాడతారు.

  • వీటిని స్తంభాలుగా కూడా వాడతారు. నేటికి వీటి వినియోగం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది.

  • తాటి కాయల నుండి ముంజలను వేరు చేసి తింటారని మనకు తెలిసిందే.

  • తాటి పండ్ల గుజ్జుతో ‘తాండ్ర’ తయారు చేస్తారు.

  • తాటి పండ్లకున్న నార అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. తాటి పండ్లు ఎండిన తరువాత, మొలకల కోసం ఉపయోగిస్తారు. వాటిని ‘గేగులు’ పేరుతో అమ్ముతారు.

ఇదీ చదవండి: నేల, నీరు, అడవులు.. ప్రకృతికి మళ్లీ జీవం పోసే అద్భుత మార్గం!

తాటి నీరా:

  • ఈత, తాటి, ఖర్జూరం, జీరిక (జీలుగ) చెట్ల నుంచి నీరా ఉత్పత్తి అవుతుంది.

  • ఇది సహజ సిద్ధమైన ఆహార ద్రావణం. దీన్ని పామ్‌ నెక్టర్‌ అని కూడా అంటారు.

  • మంచిగా మూత్ర విసర్జన జరుగుతుంది. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 35 ఉండటం వల్ల చక్కెర రోగస్తులు కూడా దీన్ని తీసుకోవచ్చు.

  • వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. దీని నుంచి తాటి బెల్లం, తాటి చక్కెర తయారు చేస్తారు.

తాటి బెల్లం:

  • ఆహారం జీర్ణం కావటానికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్యను పరిష్కరించగలదు.

  • ఇందులో ఉండే ఇనుము బరువును తగ్గిస్తుంది. అజీర్తికి ఇది మంచి మందులా పని చేస్తుంది.

  • క్యాన్సర్‌ కారకాలను అరికట్టటానికి ఉపయోగపడుతుంది. తాటి బెల్లం అద్భుతమైన పోషకాల గని అని చెప్పవచ్చు.

  • ఇందులోని మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది.

  • ఇందులోని క్యాల్షియం, భాస్వరం ఎముకలు, పండ్ల పటిష్ఠతకు ఉపయోగపడుతుంది.

  • తాటి బెల్లాన్ని రెగ్యులర్‌గా వాడితే నీరసం రాదు. తాటి బెల్లాన్ని వాడటం వలన మైగ్రేన్‌ లాంటి తలనొప్పులు తగ్గుతాయి.

  • తాటి బెల్లంతో నువ్వుల ఉండలు చేసి రోజూ తింటే ఆరోగ్యానికి మంచిది.

తాటి కల్లు:
తాటి చెట్ల నుంచి కల్లు తీస్తారు. ఇది మత్తు పానీయం (సూర్యోదయం తర్వాత లొట్టి దించితే వచ్చేదే కల్లు. సూర్యరశ్మి పడి ఫర్మెంట్‌ అవుతుంది). ఈ చెట్లు అడవుల కంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఈ చెట్ల ఉనికి ఉంది. బహుశా ఈ చెట్లు లేని జిల్లా లేదనవచ్చు. ఈ చెట్లు కొన్ని తరాల వరకు ఉంటాయి. అనాలోచితంగా ఈ చెట్లను కొందరు చంపేస్తున్నారు. తాటి వనాలు పెంచటం కూడా ఎంతో అవసరం.

- డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924 

నిర్వహణ : పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

'ఆదర్శ కుటుంబం' పబ్లిక్ టాక్

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం.. శకలాల కోసం గాలింపు

మా మహిళలపైనే చేయి వేస్తారా..? అందరి డేటా ఉంది..!

టీడీపీకి షాక్.. YSRCP లోకి భారీగా చేరికలు

9 నెలల వర్కవుట్స్.. సమంత స్పెషల్ వీడియో!

పులివెందులలో TDP మాస్టర్ స్కెచ్ .. పోలీసులే దగ్గరుండి లాడ్జీలలో..!

Photos

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)