Breaking News

‘ఆనాటి సిగ్గరే..నేటి లెజెండ్‌!’ బుమ్రాపై పొరుగింటి ఆంటీ భావోద్వేగ పోస్ట్‌ వైరల్‌

Published on Mon, 07/01/2024 - 13:43

ఉత్కంఠభరితంగా బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌లో టీ-20 ప్రపంచ కప్‌ను టీమిండియా దక్కించుకుంది.   దీంతో టీమిండియా ఆటగాళ్లపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సూర్యకుమార్‌యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, విరాట్‌ కోహ్లీ హీరోలుగా నిలిచారు. అయితే  జస్ప్రీత్ బుమ్రా తల్లి సన్నిహితురాలు, పొలిటికల్‌ జర్నలిస్టు చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ ఒకటి వైరల్‌గా మారింది.

ప్రపంచ కప్ ఫైనల్‌లో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనకు స్టార్‌ క్రికెటర్‌పై  నా హీరో అంటూ తన ప్రేమను అభిమానాన్ని చాటుకున్నారు బుమ్రా తల్లి దల్జీత్‌కి బెస్ట్ ఫ్రెండ్ దీపాల్ త్రివేది. 

‘‘ నాకున్న క్రికెట్ పరిజ్ఞానం శూన్యం.. విరాట్‌  కోహ్లీ అనుహ్క భర్తగా తెలుసు. అతని డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు నచ్చుతుంది. ఒకప్పుడు సిగ్గరి.. ఇప్పుడు లెజెండ్' అంటూ బుమ్రాపై సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు దీపాల్‌ త్రివేది. ఇందులో బుమ్రాతో తనకున్న అనుబంధాన్ని, అతడి పడ్డ కష్టాలను వివరంగా రాసుకొచ్చారు. అంతేకాదు బుమ్రా పుట్టినపుడు తొలుత చేతుల్లోకి తీసుకున్నఅదృష్టవంతురాల్ని తానే అంటూ సంతోషాన్ని ప్రకటించారు. అప్పుడే పుట్టిన బిడ్డను తాకడం అదే మొదటిసారి. అప్పటికే కుమార్తె ఉన్నప్పటికీ  అది పెద్దగా గుర్తులేదు.  బిడ్డ సన్నగా, బలహీనంగా ఉన్నాడు .. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తు అన్నారామె.

అలాగే చిన్నప్పటినుంచీ బుమ్రా పట్టుదల, సంకల్పం గురించి వివరించారు. నిజంగా మా స్టోరీ బాలీవుడ్‌ సినిమా కంటే తక్కువేమీకాదు.  బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించిన తరువాత తల్లి రోజుకు కనీసం 16-18 గంటలు పనిచేస్తూ చాలా  కష్టపడేది.  పొరుగువారిగా, కష్టాలు, నష్టాలు  అన్నీ పంచుకున్నాం.  ఒక చిన్న ప్లాస్టిక్‌బాల్‌తో బుమ్రా ఎపుడూ క్రికెట్‌ ఆడుతూ ఉండేవాడనీ, తనకు మాత్రం  దల్జీత్‌ ఇల్లు స్వర్గధామం లాంటిదని తెలిపారు. 

ఒకసారి తన ఇంక్రిమెంట్‌ డబ్బులతో బుమ్రాకు విండ్‌చీటర్ (జాకెట్‌) కొనిచ్చిన ఏకైక బహుమతిని కూడా దీపాల్ గుర్తు చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు గర్వమనేదే లేదు. వినయం ఏమాత్రం తగ్గలేదు. అతడ్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడాలి. అతని నుండి నేర్చుకోవాలంటూ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు.

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)