Breaking News

నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ

Published on Thu, 09/25/2025 - 12:05

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ మరోసారి  తన ఫ్యాషన్‌ శైలితో ఆకట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థానీ టై-డై టెక్నిక్ సాంప్రదాయ దుస్తులలో అమ్మ వారి ఆరాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ చిత్రాలను సోషల్ మీడియాలో సందడిగామారాయి.

దుర్గాదేవి తొమ్మిది రూపాలను సూచించే బహుళ వర్ణ బనారసి పింక్‌ లెహంగా చోళిలో  అత్యంత సుందరంగా కనిపించారు. దీనిపై వివిధ రకాల బట్టలతో ప్యాచ్‌వర్క్, క్లిష్టమైన జరీ వర్క్, సంక్లిష్టమైన హ్యాండ్‌ ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహంగాలో భారీ లేస్‌వర్క్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అని చెప్పవచ్చు. ఈ స్కర్ట్‌కు  మ్యాచింగ్‌గా ప్యాచ్‌వర్క్ , బంగారు జరీ వర్క్‌తో పింక్ బ్లౌజ్‌ను ఆమె ఎంచుకున్నారు.  గులాబీ , నారింజ రంగు లెహెరియా ప్రింట్ దుపట్టాతో  నీతా అంబానీ లుక్‌మరింత ఎలివేట్ అయింది. ‌ మల్టీ లేయర్డ్‌ డైమండ్స్‌, ఆకుపచ్చ పచ్చ నెక్లెస్‌తో పాటు స్టేట్‌మెంట్ చెవిపోగులు, మాంగ్ టికా, రంగురంగుల గాజులు, హెవీరింగ్‌ను ధరించారు. 

ఈ కాస్ట్యూమ్స్‌ను ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ JADE మోనికా అండ్‌ రిష్మా రూపొందించారు. నీతా అంబానీ లుక్‌కు సంబంధించిన వివరాలను షేర్‌ చేశారు. గుజరాత్ ఆత్మ నుండి ప్రేరణతో పవిత్రమైన మూలాంశాలు ,శక్తివంతమైన కచ్చి వస్త్రాలతో కూడిన దైవిక నేపథ్యంలో  నీతా అంబానీ లుక్ సజీవంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. 

(Weight Loss వెయిట్‌ లాస్‌లో ఇవే మెయిన్‌ సీక్రెట్స్‌)

అంతేకాదు అంబానీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఐలైనర్, కోల్-ఐడ్, మస్కారా-కోటెడ్ లాషెస్, బ్లష్డ్ బుగ్గలు, రేడియంట్ హైలైటర్, న్యూడ్ లిప్‌స్టిక్‌తోపాటు, మిడిల్-పార్టెడ్ బన్ హెయిర్‌స్టైల్ , నుదిటిపై ఎర్రటి  బొట్టు తదితర వివరాలను అందించారు. 

(సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్‌ బీలా వెంకటేశన్ ఇకలేరు)
నెటిజన్ల స్పందన
సోషల్ మీడియా వినియోగదారులు ఆమె సొగసైన స్టైలింగ్‌ను ప్రశంసించారు. నవరాత్రి క్వీన్‌కు అవార్డు  నీతా అంబానీ జీకి దక్కుతుంది. ఎలిగెంట్ రాయల్, చాలా అందంగా ఉ‍న్నారంటూ  కొనియాడటం విశేషం. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)