టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
Published on Sun, 03/24/2024 - 07:51
నైలా గ్రేవాల్.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా! బయటెంత ఫాలోయింగ్ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే..
- నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. డాన్స్ నేర్చుకుంది. థియేటర్ స్కిల్స్ కూడా ఒంటబట్టించుకుంది.
- ముందు మోడలింగ్ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్ బాలేలు చేస్తూ.. థియేటర్లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది.
- అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట.
- మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్’లలో నటించింది. ‘ఇష్క్ విష్క్ రిబౌండ్’లో నటిస్తోంది.
- తాజాగా ‘మామ్లా లీగల్ హై’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
- ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్ స్టయిల్‌కి.. డాన్స్కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు.
సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్.. ఏ స్క్రీన్ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్.
ఇవి చదవండి: లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్!
#
Tags : 1