Breaking News

ఎంఎస్‌ ధోనీ కుమార్తె జివా ఏం కావాలనుకుంటుందో తెలుసా? వైరల్‌ వీడియో

Published on Sat, 10/25/2025 - 15:21

డాక్టర్‌ బిడ్డ డాక్టర్‌ కావాలని, యాక్టర్‌ బిడ్డ యాక్టర్‌, వ్యాపారి బిడ్డ వ్యాపరే  అవుతుందని సాధారణంగా భావిస్తుంటాం.  తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకుని  కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టనవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే టీమీండియా స్టార్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ  అభిమానిగా ఆయన కుమార్తె క్రికెటర్‌గా రాణించాలనుకుంటున్నారా? మెరుపువేగంతో సెంచరీలు  చేస్తూ,  క్రికెట్‌ గ్రౌండ్‌లో  తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు  చూపించాలనుకుంటున్నారా? అయితే మీకో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌. ధోని ముద్దుల తనయ పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటోందో తెలుసా?

ఎంఎస్‌ ధోనీ, సాక్షిల ఏకైక కుమార్తె జీవా.  ఈ జంటకు 2010లో వివాహం జరగ్గా.. 2015లో జీవా జన్మించింది.   భవిష్యత్తులో ఏం  చేస్తావు అంటే పిల్లలు సాధారణంగా, డాక్టర్‌, యాక్టర్‌, టీచర్‌, పైలట్‌ ఇలాంటి సమాధానాలే  చెబుతారు. కానీ ప్రకృతిని ప్రేమించి, ప్రకృతి శాస్త్రవేత్తను అవుతాను  ధోనీ కుమార్తె చెప్పడం విశేషంగా నిలిచింది.

(రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్‌ కామత్‌ ఆఫర్‌)

శుక్రవారం నాడు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడితో జరిగిన సంభాషణలో, తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని ఎంఎస్ ధోని కుమార్తె జీవా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ధోని భార్య సాక్షీ, జీవా  కాశీ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. హర్ కి పౌరి ప్రాంతం సమీపంలోని మరొక వీడియోలో, సాక్షి మరియు ఇతరులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు చూపించారు. వారి సందర్శనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగా సభ కార్యదర్శి తన్మయ్ వశిష్ఠ ఈ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. 10 ఏళ్ల చిన్నారికి ఇలాంటి  కోరిక ఉండటం చాలా ఆనందం అంటూ ప్రశంసించారు.భవిష్యతుల్లో మంచి మనిషిగా  రాణిస్తుంది అంటూ దీవించారు నెటిజన్లు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)