Breaking News

15 ఏళ్ల నాటి ఆభరణాలతో, అందర్నీ కట్టి పడేసిన సాక్షి ధోనీ

Published on Fri, 03/14/2025 - 15:35

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్  వివాహానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ,  అతని భార్య సాక్షి ధోని హాజరయ్యారు. సతీసమేతంగా  ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ   ధోని సందడి చేశాడు. రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ “అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ”లోని “తు జానే నా” అనే  సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ పెళ్లిలో ఇంకో విశేషం  కూడా చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని తన ఆకర్షణీయమైన శైలితో వార్తల్లో నిలిచింది.

సాక్షి ధోని ఫ్యాషన్, స్టైల్‌కి చాలా  ప్రాధాన్యత ఇస్తుంది. రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుకలో పెళ్లైన ఇన్నాళ్ల తరువాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత తన పెళ్లి రోజున ఆభరణాలను ఆభరణాలను తిరిగి ధరించింది.ఆ  ఆభరణాలే అందరి దృష్టిని ఆకర్షించాయి. డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌ అన్నట్టు వజ్రాలు, పచ్చలు పొదిగిన గోల్డ్‌ జ్యుయల్లరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోల్డ్‌ చోకర్ నెక్‌పీస్, లేయర్డ్ నెక్లెస్,  ముక్కెర, జుమ్కాలతో తన లుక్‌కు మరింత   స్టైల్  యాడ్‌ చేసింది.  లెమన్‌ గ్రీన్‌ కలర్‌ పట్టుచీర, స్కాలోప్-నెక్ డిజైన్ ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్‌, దీనికి జతగా  రెడ్‌ అండ్‌ ఆరెంజ్‌  కలర్   మిర్రర్‌ దుపట్టాతో తన లుక్‌ను మరింత ఎలివేట్‌ చేసుకొని  అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. సాధారణంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే సాక్షి, దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఇవి  వైరల్‌గా మారాయి.

మరోవైపు పెళ్లి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ధోనీ, సాక్షి, పంత్ మ‌ధ్య ఆకర్ష‌ణీయ సంభాష‌ణ కూడా వైరల్‌గామారింది.  త‌మ రిలేష‌న్ షిప్ లో ధోనీనే ల‌క్కీ అని సాక్షి  సిగ్గుల మొగ్గలవుతూ చెప్పింది. ఇంతలో మ‌ధ్య‌లో కల్పించుకున్న  పంత్, ఆడ‌వాళ్లంద‌రూ ఇలాగే అనుకుంటారని  తుంటరి కమెంట్‌ చేయడంతో  అక్క‌డంతా న‌వ్వులు పువ్వులు పూశాయి.  ఈ వీడియోపై     కామెంట్లు వెల్లువెత్తాయి.

సాక్షి ధోని పెళ్లి రోజు లుక్
15 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహానికి, భారీ నెక్లెస్‌, చూడామణి లాంటి ఆభరణాలు సహా బుటీ  వర్క్‌, జర్దోసి ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు, ఆకుపచ్చ రంగు లెహంగా ధరించింది 2010  జూలై 10న  డెహ్రాడూన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)