Breaking News

Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్‌ వన్‌ మనమే..!

Published on Thu, 05/29/2025 - 08:37

మిస్‌ వరల్డ్‌ 2025 పోటీల్లో కీలక ఘట్టాలకు తెరలేచింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. నగరంలో తొలిసారి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ సారి భారతీయ సుందరి నందిని గుప్తా గెలిస్తే.. అది మరో కిరీటాన్ని భారత్‌కు అందించడం మాత్రమే కాదు అత్యధిక టైటిల్స్‌ గెలుచుకున్న దేశం అనే రికార్డ్‌ని కూడా అందిస్తుంది.  

ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్నా.. 
మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభమైన 15ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం నుంచి 1966లో రీటా ఫరియా టైటిల్‌ గెలిచారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్‌ ఈ టైటిల్స్‌ను సాధించి దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారు. 

అదే విధంగా వెనిజులా 1955, 1981, 1984, 1991, 1995, 2011లలో ప్రపంచ సుందరి కిరీటాల్ని దక్కించుకుంది. తద్వారా ఇండియా, వెనిజులా – రెండూ సమానంగా 6 టైటిల్స్‌ గెలుచుకుని నెంబర్‌ వన్‌ స్థానాన్ని పంచుకుంటున్నాయి. మన తర్వాత యునైటెడ్‌ కింగ్డమ్‌ (యుకె) 5 టైటిల్స్, జమైకా, ఐస్లాండ్‌ – రెండూ చెరో 3 టైటిల్స్‌ గెలుచుకున్నాయి.

నగరంపై నజర్‌
ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్లామర్‌ ప్రపంచం దృష్టి మొత్తం నందిని గుప్తాపైనా, హైదరాబాద్‌ నగరంపైనే ఉంది. ఈ దఫా టైటిల్‌ను నందిని గెలిస్తే అది భారత్‌ను ప్రపంచ సుందరి పోటీల్లో నెం.1 స్థానానికి చేరుస్తుంది. కాబట్టి ఆ ఘనత నగరం వేదికగా సాకారం కావాలని గ్లామర్‌ రంగ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.  

(చదవండి: అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?)

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)