Breaking News

తన బరువుతోనే అసలు యుద్ధం

Published on Tue, 07/28/2026 - 06:01

కామన్వెల్త్‌... గ్లాస్గో... ఆదివారం రాత్రి. 31 ఏళ్ల మీరాబాయి చాను మళ్లీ నిరూపించింది. 48 కిలోల బరువు విభాగంలో 190 కిలోలు ఎత్తి హ్యాట్రిక్‌ గోల్డ్‌మెడల్‌ సాధించింది. కానీ ఈ బంగారం వెనుక ఒక అదృశ్య పోరాటం ఉంది. అది తానెత్తే బరువులతో కాదు... తన బరువుతో. పన్నెండేళ్లుగా మీరాబాయి 48 కిలోల బరువునే మెయింటైన్  చేస్తోంది. 2014లో గ్లాస్గోలో ఏ బరువుతో కామన్వెల్త్‌లో మొదటిసారి పాల్గొందో, 2026లో గ్లాస్గోలో కూడా అదే బరువుతో పాల్గొని మూడో బంగారం తెచ్చింది. మహిళలకు వయసు పెరిగే కొద్దీ బరువు పెరగడం సహజం. కానీ మీరా మాత్రం ఒకే బరువు, ఒకే క్రమశిక్షణ. ఆమె ఫిట్‌నెస్‌ రహస్యం ఏమిటి?

‘వెయిట్‌లిఫ్టర్లం అనగానే అందరూ మేము విపరీతంగా తినేస్తాం అనుకుంటారు. కానీ అది తప్పు, మేం చాలా తక్కువ తింటాం. బ్రెడ్, పాలు కూడా ముట్టలేము. ప్రతి గ్రాముకూ లెక్క ఉంటుంది’  అంటుంది మీరాబాయి చాను. బరువులెత్తడంలో ప్రపంచ విజేతగా నిలుస్తున్న మీరాబాయి తన బరువు విషయంలో కూడా అంతే విజేత. ‘బరువు తగ్గడం సాధ్యం కావడం లేదు’ అనేవారికి  మీరాబాయి 12 ఏళ్లుగా  స్థిరంగా మెయిన్‌టెయిన్‌ చేస్తున్న బరువు తప్పక స్ఫూర్తి కలిగించవచ్చు.

ఆమె విజయం సులభం కాదు
ప్రపంచ వేదికల మీద పతకాలు సాధిస్తున్న మీరాబాయి జీవితం మనకు కనిపించేంత గ్లామరస్‌ కాదు.  ‘ట్రైనింగ్‌లో పిచ్చిగా కష్టపడాలి. లేదంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం’ అంటుందామె. సాధన ఒకటే కాదు గాయాలూ వెంటాడుతాయి. 2023లో తొడ గాయం. ఈ ఏడాది భుజం నొప్పి. పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళలకు సహజంగా వచ్చే మెన్‌స్ట్రువల్‌ పెయిన్‌తో బాధ పడుతూనే పోటీ రోజు వేదిక ఎక్కింది. గ్లాస్గో పోటీకి కొన్ని రోజుల ముందు శిక్షణలో చిన్న గాయం. అయినా సాధన ఆపలేదు. కోచ్‌ విజయ్‌శర్మతో ఉదయం 5 గంటల నుండి బరువు ఎత్తే సాంకేతికతను వేలాదిసార్లు ప్రాక్టీస్‌ చేయడం. ఒక మిల్లీమీటర్‌ తేడా వచ్చినా పతకం జారిపోతుందని ఆమెకు తెలుసు.

చిన్నప్పటి నుంచి కష్టాలు
మణిపూర్‌లోని నోంగ్‌పోక్‌ కచింగ్‌ గ్రామం మీరాబాయిది. పేద కుటుంబం. మీరాకు ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. తండ్రి రోజు కూలీ. తల్లి చిన్న టీ కొట్టు నడిపేది. చదువు 12వ తరగతితో ఆగిపోయింది. కానీ ఆమెకు బలం ఉండేది. ఆరేళ్ల వయసులో అన్నయ్య మోయలేని కట్టెల మోపును తనే మోసేది. ఇంట్లో బియ్యం బస్తాలు, నీళ్ల కుండలు లేవనెత్తేది. ‘ఈ పిల్లకు చేతుల్లో బలం ఉంది’ అని ఒక కోచ్‌ గుర్తించాడు. పన్నెండేళ్లకే ఇంటి నుండి ముప్పై కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి ఇంఫాల్‌ స్టేడియానికి ప్రాక్టీసుకు వెళ్లేది. అమ్మ నగలు అమ్మి, అన్నయ్య జీతం నుండి డబ్బులు ఇచ్చి పోటీలకు పంపారు. 

2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పుడు దేశమంతా విమర్శించింది. కానీ, ఆ విమర్శలనే ఇంధనంగా మార్చుకుని 2017లో ప్రపంచ ఛాంపియన్ గా, 2020 టోక్యోలో ఒలింపిక్‌ రజత విజేతగా నిలిచింది. ఈరోజు ఆమె ధరించే చెవిపోగులు రియోకు ముందు అమ్మ చేయించినవే. ‘అవి నాకు అదృష్టాన్ని తెస్తాయి’ అంటుంది.

ముగింపు
మీరాబాయి చాను మనకు నేర్పింది ఒకటే. బరువు తగ్గడం అంటే అందం కోసం కాదు. ఆత్మగౌరవం కోసం. ఆరోగ్యం కోసం. లక్ష్యం కోసం. శరీరం బరువు 48 కేజీలైనా ఆమె మనసు 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తోంది.
‘నా శరీరం నా ఆలయం. దాన్ని బలంగా ఉంచుకోవడం నా బాధ్యత’ అంటుంది మీరాబాయి చాను.  ఈ మాట ఒక్కటి చాలు. మనం కూడా మన శరీరాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి.
 
ఆహార నియమాలు
ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. 48 కిలోల క్రీడాకారిణిగా ఉండాలంటే ప్రతి గ్రామూ లెక్కే. పండగ భోజనం, జిలేబి ముక్క కూడా బరువు పెంచేస్తుంది. పోటీకి ముందు రోజులలో నీళ్లు కూడా తక్కువ తాగుతుంది. చెమట పట్టించి, సౌనా బాత్‌లో కూర్చుని ఆవిరితో ఒక్కో గ్రాము తగ్గిస్తుంది.  మీరాబాయి ఫిట్‌నెస్‌కు 3 స్తంభాలు ఉన్నాయి. ఆహారం, సాధన, మానసిక బలం.

1. ఆహారం
ఉదయం: గోరువెచ్చని నీళ్లు, తేనె, గుడ్డు తెల్లసొన, ఓట్స్, పండ్లు.
మధ్యాహ్నం: ఉడికించిన చికెన్‌ లేదా చేప, గోధుమ రొట్టెలు, పెద్ద సలాడ్‌.
సాయంత్రం: పాలు, బాదం, ప్రోటీన్‌ పానీయం.
రాత్రి: సూప్, ఉడికించిన కూరగాయలు, పప్పు.
నూనె, తీపి, వేయించిన పదార్థాలకు దూరం. రోజుకు 4 నుండి 5 లీటర్ల నీళ్లు. ఆకలి వేసినా నీళ్లు తాగి కంట్రోల్‌ చేస్తుంది.

2. సాధన
ఉదయం: జిమ్‌లో సాంకేతిక సాధన. బరువు ఎత్తడం, పట్టు.
మధ్యాహ్నం: కార్డియో, పరుగు, సైక్లింగ్, తాడు దూకడం. 
సాయంత్రం: యోగా, స్ట్రెచింగ్‌. గాయాలు రాకుండా శరీరాన్ని సాగదీయడం.
ఒక్కరోజు కూడా సెలవు లేదు. ‘నా క్లాస్‌రూమ్‌ జిమ్‌’ అంటుంది.

3. మానసిక బలం
‘నా కళ్ల ముందు ఎప్పుడూ దేశ జెండా ఉంటుంది’ అంటుంది మీరా. గ్లాస్గోలో మొదటి ప్రయత్నం విఫలమైనా ఆందోళన చెందకుండా, స్మైల్‌ ఇస్తూ తర్వాతి రౌండ్‌లో రికార్డు కొట్టడం ఆమె మానసిక బలానికి నిదర్శనం.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)