Breaking News

కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్‌ వీడియో

Published on Tue, 07/01/2025 - 12:11

బిడ్డ ప్రాణాలు  ప్రమాదంలో పడితే..ఏ తండ్రి అయినా చూస్తూ ఉరుకుంటాడా..? తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు దూకేస్తాడు. సరిగ్గా అదే  చేశాడో తండ్రి.  తన కళ్లముందే  బిడ్డ సముద్రంలో పడిపోవడాన్ని చూసి క్షణం ఆలోచించకుండా దూకేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. 

డిస్నీ క్రూయిజ్ షిప్ లోని 4వ డెక్ నుంచి  ఒక పాప పొరపాటున జారి పడబోయింది.  ఇది చూసిన  తండ్రి క్షణం ఆలోచించుండా ఆమెను కాపాడటానికి సముద్రంలోకి దూకాడు. జూన్ 29న బహామాస్ - ఫోర్ట్ లాడర్‌డేల్ మధ్య ఓడ ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. బహామాస్ చుట్టూ నాలుగు రాత్రుల  షిప్‌లో గడిపిన తరువాత  ఓడ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌కు తిరిగి వస్తోంది. 

చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్‌ స్టోరీ వైరల్‌

"ఓడ వేగంగా కదులుతోంది. సముద్రపు హోరును, నీటి మెరుపులను చూస్తూ  ప్రయాణికులుఎంజాయ్‌ చేస్తున్నారు. తన అయిదేళ్ల కమార్తెకు తండ్రి రైలింగ్ దగ్గర ఫోటో తీస్తున్నాడు. ఇంతలోనే ఆ పాప పడిపోయింది. వెంటనే తండ్రి కూడా దూకేశాడు. దీంతో  ఓడ సిబ్బంది  కూడా అప్రమత్తమయ్యారు.  కెప్టెన్ వెంటనే ఓడను స్లో చేశాడు. ఇంతలో క్రూ సభ్యులు లైఫ్‌సేవర్లను నీటిలోకి విసిరారు. క్రూయిజ్ షిప్ నుంచి రెస్క్యూ బోట్  ద్వారా  తండ్రీ కూతుళ్లను  రక్షించారు. ఇది కళ్లప్పగించి చూస్తున్న ప్రయాణికులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. అటు ప్రయాణీకులు, ఇటు డిస్నీ  సిబ్బంది  తండ్రి ధైర్యాన్ని ప్రశంసించారు.హీరో అంటూ  నెటిజనులు కూడా తండ్రిని అభినందనల్లో ముంచెత్తారు. ఈ సంఘటనను రికార్డ్ చేసిన ట్రేసీ రాబిన్సన్-హ్యూస్, "బిడ్డను కాపాడటానికి దూకిన ఒక హీరో’’ అంటూ  ప్రశంసించారు.  దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. 

మరోవైపు డిస్నీ క్రూయిజ్ లైన్  తమ సిబ్బంది  స్పందించిన తీరు,  ప్రయాణీకులను రక్షించిన తీరును ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.  సోమవారం తెల్లవారుజామున ఆ ఓడ సురక్షితంగా పోర్ట్ ఎవర్‌గ్లేడ్స్‌కు తిరిగి వచ్చింది.

ఇదీ చదవండి: 5 వేల కిలోమీటర్ల దూరంనుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు
 

Videos

హైదరాబాద్ లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు

చంద్రబాబుకు బనకచర్ల పూర్తిచేసే ఉద్దేశం లేదు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

శ్రీవాణి టికెట్ల కేంద్రం దగ్గర కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా లేదని ఫైర్

ఏపీ రాజధాని కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణకు యత్నం

అనకాపల్లి జిల్లా పూడిమడకలో విషాదం

Medical Graduates: ఇంత చదవడవం కంటే అడుక్కోవడం బెటర్

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 17న రైల్ రోకో నిర్వహిస్తున్నాం: కవిత

Sailajanath: లోకేష్... దమ్ముంటే సింగయ్య భార్య ప్రశ్నలకు సమాధానం చెప్పు

తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌కు చేదు అనుభవం

Palakollu roads: అంతన్నారు.. ఇంతన్నారు చివరికి గోతులు పడితే మాత్రం!?

Photos

+5

చినుకుల్లో డార్జిలింగ్‌ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

నేచురల్‌ బ్యూటీ 'వర్ష బొల్లమ్మ' స్పెషల్‌ ఫోటోలు చూశారా..? (ఫొటోలు)

+5

మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్​నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)

+5

నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)

+5

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)