Breaking News

భార్యామణికోసం ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన వ్యాపారవేత్త?!

Published on Thu, 09/26/2024 - 15:29

కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చుతున్న భర్తల్ని చూశాం. జీవిత సహచరి కోసం ఎన్నో త్యాగాలను చేసే  పుణ్యపురుషుల గురించి విన్నాం. కానీ   ఒక భర్త భార్య ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునేందుకు, ఆమెను ఇంకెవ్వరూ చూడకుండా ఉండేందుకు ఏకంగా ఐలాండ్‌నే కొనేశాడు. విచిత్రంగా అని పిస్తోందా? అయితే  ఈ కథనం చదవాల్సిందే.

దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదాక్  కోసం హిందూ మహా సముద్రంలోని ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.418 కోట్లు) వెచ్చించి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.

దుబాయ్‌కి చెందిన సౌదీ అల్ సదాక్  కథనం ప్రకారం మిలియనీర్‌ అయిన తన భర్త బీచ్‌లో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అదీ తాను బికినీ వేసేందుకు, ఇబ్బంది పడకుండా, సురక్షితంగా ఉండేందుకు ఇలా చేశాడని ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. అయితే గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ద్వీపం ఖచ్చితమైన లొకేషన్‌ను షేర్ చేయడం లేదు కానీ, ఇది మాత్రం ఆసియా ఖండంలోనే ఉంది అని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్‌  చేసింది. దీంతో ఇది నెట్టింట​  చక్కర్లు  కొడుతోంది. దాదాపు 30 లక్షల వీక్షణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై నెటిజన్లు  విభిన్నంగా స్పందించారు.

కాగా ఈ జంట దుబాయ్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. వీరికి పెళ్లయ్యి మూడేళ్లు. సౌదీ అల్ సదాక్ ఇన్‌స్టాగ్రామ్  టిక్‌టాక్ ద్వారా ఆమె లగ్జరీ స్టయిల్‌తో  బాగా పాపులర్‌. 

ఇదీ  చదవండి: రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్‌ కాంబో



 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)