Breaking News

ఎవరీ పిడుగు.. ఎనిమిదేళ్లకే పత్రిక ఎడిటర్‌గా రికార్డ్‌!

Published on Sat, 06/07/2025 - 12:31

పిల్లలూ! రోజూ పొద్దున్నే న్యూస్‌పేపర్‌ చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రకరకాల వార్తలు ఏరి, కూర్చి మనకు అందించేందుకు న్యూస్‌పేపర్‌ సంస్థలో అనేకమంది పనిచేస్తుంటారు. వారందరికీ బాస్‌గా వ్యవహరించేది ఎడిటర్‌. ఆ పత్రిక బయటకు రావడంలో ఆయనదే కీలకపాత్ర. ఎడిటర్‌గా స్థానం  పొందాలంటే ఎంతో అనుభవం కావాలి. అయితే ఓ పాప మ్యాగజైన్‌ ఎడిటర్‌గా మారి రికార్డు సృష్టించింది.

ఆస్ట్రేలియాకు చెందిన రోక్సాన్‌ డౌన్స్‌...ఎనిమిదేళ్లకే ’ఇట్‌ గర్ల్‌  మ్యాగజన్‌’ (It Girl Magazine) అనే మ్యాగ్‌జైన్‌ కి ఎడిటర్‌గా మారింది. ఆ వయసున్న చిన్నారులు తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు. అయితే రోక్సాన్‌ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉంది. తన వయసున్న ఆడపిల్లలు చదువుకునే మ్యాగ్‌జైన్‌ రూపొందించాలని భావించింది. దానికి తనే ఎడిటర్‌గా మారింది. మ్యాగ్‌జైన్‌లో ఏం రాయాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో తెలుసుకునేందుకు రోక్సాన్‌ చాలా పరిశోధనలు చేసింది. రోజంతా తన వయస్సు గల వారితో తిరుగుతూ వారి ఇష్టాలు, ఇబ్బందులు, వారు ఆసక్తులు గమనించి, వాటి గురించి తన మ్యాగ్‌జైన్‌లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది.

చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్‌డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం

మ్యాగ్‌జైన్‌ కోసం ప్రముఖ పాప్‌ గాయకుడు జస్టిన్‌ బీబర్‌ని రోక్సాన్‌ ఇంటర్వ్యూ చేసింది. అది ప్రఖ్యాతి పొందడంతో ఆ తర్వాత అనేకమంది రచయితలు, టిక్‌టాక్‌ స్టార్లు, గాయకులు, నటులను ఇంటర్వ్యూలు చేసే స్థితికి చేరుకుంది. ఆ ఇంటర్వ్యూలను వీడియో రూపంలో యూట్యూబ్‌లో చూడొచ్చు. ఓ వైపు మ్యాగ్‌జైన్‌  పనులు చేస్తూనే,  పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది రోక్సాన్‌. బద్దకంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని, జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉండాలని తను చెపుతోంది.

ఇదీ చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)