Breaking News

ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్‌ ఏంటంటే..!

Published on Thu, 05/01/2025 - 12:44

క్షణికావేశం ఎంతటి అనర్థానికి దారి  తీస్తుంది.  తీవ్ర వాగ్వాదం, మానసిక ఒత్తిడి, భావోద్వేగం వీటిమీద నియంత్రణ లేకపోతే ప్రాణాలకే ముప్పు.  కానీ చైనాలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే.. ఔరా అంటారు. హాలీవుడ్‌ రేంజ్‌లో..ఇదేం ట్విస్ట్‌ రా మామా..  అనుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందంటే..

 y"> ప్రియురాలితో  గొడవ పడుతూ.. క్షణం ఆలోచించకుండా పక్కనే ఉన్న కిటికీ లోంచి అమాంతం దూకేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం ఇది చాలా ఎత్తైన భవనంలా కనిపిస్తోంది. మొదట దూకడానికి ప్రయత్నించి నపుడు అమ్మాయి  తీవ్రంగా అడ్డుకుంది. వెనక్కి వచ్చాడు. కానీ రెండో సారి అంతే వేగంగా ముందుకు దూకేశాడు. దెబ్బకు ప్రాణాల్లో కలిసి పోవాల్సిందే. ఈ నెల ప్రారంభంలో హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలోని యుహువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ట్విస్ట్‌   ఏంటంటే..

వీధికి అవతలి వైపు ఉన్న వేరే కెమెరాలో మాత్రం అసలు విషయం బైటపడింది. కిటీకిలోంచి దూకిన తరువాత అతడు మరో చిన్న వాల్‌ పై పడ్డాడు. దీంతో దుమ్ము దులుపుకొని తాపీగా,  సైడ్‌ వాక్‌నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సో..ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హోటల్ ఈ సంఘటనను ధృవీకరించింది. అంతేకాదు కిటికీ గ్లాస్‌ నష్టాన్ని వసూలు చేసింది. స్థానిక పోలీసులు కూడా వారిద్దరూ లవర్స్‌ అని తేల్చి  చెప్పింది.  ఇద్దరూ ఎవరూ ఫిర్యాదు  చేయలేదు కాబట్టి, తాము జోక్యం చేసుకోలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే అసలు  గొడవ ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నెటిజన్లు మాత్రం రోజర్ రాబిట్‌ సినిమాను  గుర్తుచేసుకున్నారు. హాలీవుడ్‌లో స్టంట్‌ మాస్టర్‌లా పనికి వస్తాడంటూ కమెంట్స్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?

చివరిగా సరదాగా అనిపించినా.. ఇలాంటి స్టంట్లు ఒక్కోసారి ప్రాణాలకే చేటు తెస్తాయి.అలాగే  ప్రేమలో వైఫల్యం, జీవితంలో బాధలు, అనారోగ్యం,  కుటుంబ సమస్యలు, ఆర్థిక  సమస్యలు ఇలా కారణం ఏదైనా సయమనం ఉండాలి. అప్పుడే భవిష్యత్తు బంగారమవుతుంది. ఆత్మహత్యా ప్రయత్నాలనుంచి బైటపడిన వారి గాథలు వింటే ఇది ఎంత సత్యమో అర్థం మవుతుంది. క్షణికావేశం..కుటుంబాల్లోని ఆప్తులకు, సన్నిహితులకు కూడా మరణశాసనం లాంటి ఇది గుర్తు పెట్టుకోవాలి.  ఆగి ఆలోచించే ఓపిక తెచ్చుకోవాలి. బతుకు బంగారు  బాటను చేసుకోవాలి. 
 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)