హీరో మహేశ్‌ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Published on Fri, 12/26/2025 - 13:53

వారణాసి’మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు హీరో మహేశ్‌ బాబు. ఆ మూవీ కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు (Kalarippayattu) నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్‌ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్‌ఫుల్‌ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక కలరిపయట్టు ఇటీవల చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ కోసం, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు దీన్ని నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి కలరియపట్టు యుద్ధ కళ? ఇది ఫిట్‌నెస్‌కి ఎలా ఉపకరిస్తుంది సవివరంగా తెలుకుందాం.!.

ఇంతకముందు ఈ కలరిపయట్టుని సైనా నెహ్వాల్‌ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్‌ నటి పరిణితిచోప్రా కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు కూడా. దీన్ని సాధన చేస్తే..బాడీ ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్లు ఉంటుందని చెప్పుకొచ్చారామె. 

కలరిపయట్టు అంటే.
కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పక ప్రదర్శిస్తారట. కలరిపయట్టు శిక్షణలోని వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేగాదు మన శరీరం, మనస్సును అప్రమత్తంగా, చురుకుగా ఉంచుతాయి.

ఎలా శిక్షణ ఇస్తారంటే..
కలరి'గా పిలిచే ఒక ప్రత్యేక శిక్షణా స్థలంలో ఈ యుద్ధ కళ నేర్పుతారు. పోటీ పడుతున్న ప్రత్యర్థి కలరి అభ్యాసకుడికి కొత్త పోరాట కదలికలను నేర్పిస్తుంటాడు. శిక్షణ పొందే వ్యక్తి ఈ కొత్త విధానాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రతిఘటించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తమిళ రాజ్యాలతో యుద్ధాల చేసే సమయంలో మళయాళులు దీన్ని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 

ఆరోగ్య ప్రయోజనాలు..

  • కలరిపయట్టు శిక్షణలో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఇది శరరీ ధృడ్వత్వాన్ని పెంచుతుంది. 

  • హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇందులో వుండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు హృదయ స్పందన రేటును పెంచుతాయి. 

  • రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 

  • ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది

  • ప్రాథమిక మోటారు వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడేవారికి, నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితం ఉంటుందట.  అలా పలువురి విషయంలో నిరూపితమైందట కూడా. 

అంతేగాదు ఈ ప్రాచీన యుద్ధ విద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. 

 

(చదవండి: పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..!భారత్‌ ఆరోగ్య సంరక్షణపై ఎన్నారై ప్రశంసల జల్లు)
 

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)