పుతిన్‌ ఇష్టపడే వంటకాలివే..!

Published on Fri, 12/05/2025 - 17:43

భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. హైదరాబాద్‌ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అధికారిక విందులో ఆయ ఇష్టంగా ఆస్వాదించే వంటకాలేవి, ముఖ్యంగా ఇలాంటి పర్యాటనలలో ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటారు తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.

పుతిన్‌ భారత్‌ వంటకాలను రుచి చూస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ పుతిన్‌ క్రమశిక్షణ, కఠినమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన ఆహారానికి సంబంధించి.. ఫుల్‌ సెక్యూరిటీ మధ్య సైనిక పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధారణంగా హోటల్‌ లేదా ఇతర దేశాల ఆతిథ్యంలో తయారు చేసిన భోజనాన్ని చాలా అరుదుగా తీసుకుంటారట పుతిన్‌. 

మాములుగా అయితే శిక్షణ పొందిన రష్యన్‌ చెఫ్‌లు, సహాయక సిబ్బంది పుతిన్‌ వెంట వస్తుంటారు. కాబట్టి వారే ఆయన భోజనం గురించి స్వయంగా చూసుకుంటారు. అందువల్ల ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా సీక్రెట్‌గా ఉంది. అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం..ఆయన ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధ్యానత ఇస్తారట. ప్రతి ఉదయం తేనె లేదా గంజితో ట్వోరోగ్‌(రష్యన్ కాటేజ్ చీజ్)తో ప్రారంభమవుతుందట. తాజా జ్యూస్‌, కౌజు పిట్ట గుడ్లతో చేసిన ఆమ్లెట్‌, తక్కువ చక్కెర కలిగిన ఆహారాలు వంటి వాటినే తీసుకుంటారట.

ఆయన ఎర్ర మాంసం కంటే తాజా చేపలు అది కూడా కాల్చినవి ఇష్టంగా తింటారట. లేత గొర్రెపిల్ల మాంసం కూడా అప్పడప్పుడూ తీసుకుంటారట. ఇక ఆయన భోజనంలో ఎక్కువుగా టమోటాలు, దోసకాయలు, ఇతర ప్రాథమిక కూరగాయల సలాడ్‌లు తప్పనిసరిగా ఉంటుందట.

ఇక జ్యూస్‌లలో కూడా మూలికా పానీయాలు, కేఫీర్‌,  బీట్‌రూట్-ముల్లంగి జ్యూస్‌ వంటివి తీసుకుంటారట. ఇక పుతిన్‌కు పిస్తా ఐస్ క్రీం మహా ఫేవరెట్‌ డిజర్ట్‌ అట. చివరగా ఆయన క్రమశిక్షణతో కూడిన సంప్రదాయ ఆహారానికే కట్టుబడి ఉంటారట. చాలామటుకు ప్రోటీన్‌ కంటెంట​ ఉన్నవి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు పుతిన్‌ సన్నిహితులు.

(చదవండి: అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..)

 

Videos

బాబు,పవన్ లను ప్రశ్నిస్తే తప్పా..? గొంతు నొక్కే కుట్ర

పుష్ప శ్రీవాణిపై పోలీసుల ఓవరాక్షన్ చీర లాగి దురుసు ప్రవర్తన..

పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలు!

పోలీస్ స్టేషన్ లో ఆనంద్ సాయి కొడుకు సందీప్

గాలి భాను ప్రకాష్ క్వారీలపై రోజా సంచలన వ్యాఖ్యలు

Hyd: సెప్టెంబర్ లోనూ ఇంతే.. వర్షాలపై IMD హెచ్చరిక

తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్..!

మాట ఇచ్చి తప్పింది మీరు మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..?

అమెరికా రక్షణ శాఖలో తీవ్ర కలకలం!

AP: రైతులంటే ఎందుకు మీకు అంత కక్ష..?

Photos

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)