అందరూ ఆమె బతకదన్నారు..! కానీ ఇవాళ ఆమె లుక్‌ చూస్తే..

Published on Tue, 06/03/2025 - 17:23

కొందరు చావు అంచులు దాక వెళ్లొచ్చి..బతికొస్తుంటారు. అలా ఆయురారోగ్యాలతో ఉన్నావారెందరో. ఒకరకంగా వారంతా ఆ అనారోగ్యం మేల్కొలుపుతో ఆరోగ్యవంతమైన జీవితం గడిపి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ డాక్టర్‌. అంతటి భయానక పరిస్థితి నుంచి బయటపడ్డ ఆమె లుక్‌ను చూస్తే కంగుతింటారు. ఈమెనే అనారోగ్యం బారినపడింది అనే సందేహం కలుగమానదు. ప్రస్తుతం ఆమె వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి.. దీర్ఘాయువుతో ఎలా ఉండాలో చిట్కాలు చెబుతున్నారామె. మరీ ఆ డాక్టర్‌ ఆసక్తికర గాథ ఏంటో చూద్దామా..!.

లండన్‌కి చెందిన 53 ఏళ్ల లైఫ్‌స్టైల్‌ వైద్య నిపుణురాలు డాక్టర్ అల్కా పటేల్‌ని చూస్తే 23 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది. ఆమె జీవ సంబంధమైన వయసు కేవలం 23 ఏళ్లేనని ఆమెనే స్వయంగా చెబుతున్నారు. మనలో కొందరూ ఏజ్‌ పరంగా చాలా పెద్దవాళ్లైన లుక్‌చూస్తే చిన్నవాళ్లలా ఉంటారు. అలా మనం కూడా ఉండొచ్చని అల్కా అంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలితో ఆరోగ్యాన్నే కాదు మన ఏజ్‌ని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారామె. 

ఒకప్పుడామె..
ఆమె రెంబు దశాబ్దాలకు పైగా జనరల్‌ ప్రాక్టీషనర్‌ సేవలందించిన డాక్టర్‌ ఆమె. ఎక్కువ సమయం తన పేషెంట్ల బాగోగుల, కుటుంబ బాధ్యతలకు కేటాయించి తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారామె. దాంతో సడెన్‌గా తన 39వ పుట్టనరోజున ఎడతెరగని జ్వరం బారినపడింది. సాధారణ జ్వరం కాస్త సివియర్‌ అయిపోయింది. నెమ్మదిగా అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. అసలు ఆమె ఏ వ్యాధితో బాధపడుతుందో వైద్యులకే అంతు చిక్కలేదు. 

ఇక లాభం లేదని అవయవాలు పనిచేసేలా కొన్ని శస్త్ర చికిత్సలు కూడా చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిదంటే..తన పిల్లలకు అమ్మగా తానేం చేయకుండానే చనిపోతాననే బెంగతో జీవచ్ఛవంలా అయిపోయింది. ఒకరకంగా ఆ అనారోగ్యం అల్కాకు తన ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టేలా చేసింది. ఎలాగైన తన పిల్లల కోసం ఈ అంతుచిక్కని వ్యాధిని ఎలాగైనా జయించాలనే ధైర్యాన్ని కూడగట్టుకుంది. 

అలా నెమ్మదిగా..తగినంత విశ్రాంతి, పోషకాహారంపై దృష్టిపెట్టి తనను తాను బాగుచేసుకుంది. ఆ తర్వాత మరింత ఆరోగ్యంగా ఉండేలా..వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఆహారంపై ఫోకస్‌ పెట్టారు అలా ఆమె యవ్వనంగా మారడమే గాక పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తిగా జీవించడం ప్రారంభించారు. ఆ అనారోగ్యమే తన కళ్లు తెరిపించిందని అంటారామె. పైగా ఇవాళ ఆమె దీర్గాయువు నిపుణురాలిగా సేవలందిస్తున్నారు కూడా. ఇక ఆమె ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని నిర్వహించడం కోసం ఆరింటిని తప్పనిసరిగా పాలోకండని సూచిస్తున్నారామె. అవేంటంటే..

సూర్యకాంతిలో గడపటం: ప్రతిరోజు ఉదయం కనీసం ఒక్క నిమిషం సూర్యకాంతిలో గడపటం. ఓ పదిసెకన్లు కళ్లు మూసుకుని మీకోసం మీతో గడపాలట.
వాకింగ్‌: గుండె ఆరోగ్యం, శక్తిని పెంచడానికి ఓ 20 సెకన్ల పాటు నడవాలట. 
హైడ్రేటెడ్‌ ఉండటం: ప్రతి 30 నిమిషాలకు నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టడం
పొగడ్తలు, గర్వంగా ఫీలైన క్షణాలు: మిమ్మల్ని మెచ్చకున్న వ్యక్తులను గుర్తుచేసుకోండి. అలాగే మీకు మద్దతు, సహయం చేసేవారిని ప్రశంసించడం అలవాటు చేసుకోవాలట
వర్కౌట్లు: శరీరంలో మంచి కదలికలు ఉండటం కోసం ఓం 50 సెకన్ల పాటు వాటికి సంబంధించిన వ్యాయామాలు చేయలట
బ్రీథింగ్‌ వ్యాయామాలు: నాడీ వ్యవస్థను శాంతపరిచేలా ప్రతి రోజు ఒక​ గంట శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం తదితరాలతో వ్యాయమాన్ని తిప్పికొట్టి ఆరోగ్యవంతంగానే కాకుండా నిత్య యవ్వనాన్ని సొంత చేసుకోగలమని చెబుతున్నారు డాక్టర్‌ అల్కా పటేల్‌.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సం‍ప్రదించడం ఉత్తమం. 

(చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్‌)


 

Videos

తెలంగాణ కుంభమేళా.. మేడారంకు క్యూ కట్టిన భక్తులు

రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్

ఐర్లాండ్ లో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు

ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్..? పవన్ పై కారుమూరి వెంకట్ రెడ్డి ఫైర్

2019 రియల్టర్ హత్య కేసు.. CBI అదుపులో DK ఫ్యామిలీ

పేకాట డాన్లుగా.. టీడీపీ నేతలు

ఏం పీకుతామా!.. జగన్ వచ్చాక తెలుస్తది

చావును జయిస్తా.. ఏడాదికి 166 కోట్లు

లోకేష్ బూతులకు YSRCP పగిలిపోయే రిప్లే

ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ! బంగ్లాదేశ్ హిందూ హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

పూల డ్రస్‌లో మెరిసిపోతున్న సంయుక్త (ఫొటోలు)

+5

నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)

+5

కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)

+5

'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రిస్మస్‌ కళ.. అందంగా ముస్తాబైన చర్చిలు (ఫొటోలు)

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)