Breaking News

చదువులోనే కాదు.. జీవితాన్ని కూడా పరీక్షించాలి!

Published on Thu, 07/09/2026 - 12:21

చదువులోనే పరీక్షలు కాదు. జీవితాన్ని కూడా పరీక్షించాలి. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ అంటాడు పరీక్షింపబడని జీవితం వ్యర్థ జీవితమని. దీన్ని సమర్థించే సందర్భం కఠోపనిషత్తులో నచికేతుని సత్యాన్వేషణ  ప్రయత్నంలో చూస్తాం. నచికేతుడు తన తండ్రి చేస్తున్న యజ్ఞయాగాదులలో ముసలి, నిరుపయోగ ఆవులను దానంగా ఇవ్వడం ఆశ్చర్యమనిపిస్తుంది. తన మదిలో ఇవే ప్రశ్నలు ‘‘ఇది సరియైనదేనా? నిజాయితీ లేని చర్యలకు విలువుంటుందా?’’ అని.

తన మదిలో రగులుతున్న ప్రశ్నలకు సమాధానం తన తండ్రి నుంచి రాబట్టాలనుకుని తండ్రి నడుగుతాడు ‘‘తండ్రీ నువ్వు నన్ను ఎవరికి అర్పిస్తావు?’’ అని. పదే పదే అడుగుతున్న ఈ ప్రశ్నకి తండ్రి కోపోద్రిక్తుడై ‘‘నిన్ను యమునికి (మృత్యువుకి)సమర్పిస్తాను’’ అంటాడు. దాంతో నచికేతుడు యముని దగ్గరకు వెళ్ళి సంపద, ఆధిపత్యం, అమరత్వం కోరకుండా ‘‘మరణానంతరం ఏమవుతుంది? అసలు నిజమైన సత్యం ఏదీ...’’ అని అడుగుతాడు.

యముడు నచికేతుని సంపదలు, రాజ్యం, భోగభాగ్యాలు కోరుకోమంటాడు. కానీ నచికేతుడు ఈ సంపదలు, సౌఖ్యాలు తాత్కాలికాలని...కాబట్టి ఎప్పటికీ చావులేని సత్యమే కావాలని పట్టుబడతాడు. అపుడు యముడు సంతసించి మోక్షసాధనమైన ఆత్మజ్ఞానం బోధిస్తాడు. ఇందులో గమనించాల్సింది సాధారణంగా మనుషులు అలవాట్లను, ఆచారాలను, కోరికలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. కానీ నచికేతుడు జీవితాన్ని ప్రశ్నించుకొని, పరీక్షించుకొని తప్పొప్పులు, శాశ్వత–అశాశ్వతాలు, అసలు జీవిత లక్ష్యం ఏమిటి? ఈ శరీర పతనానంతరం నేను ఎవరిని... లాంటి ప్రశ్నలతో పయనించడం వలన సత్యాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందగలిగాడు. సుఖభోగాలతో వెంటాడే జీవితం అసంపూర్ణం, స్వ పరిశీలన, అనుభవం మాత్రమే అర్థవంత జీవితానికి మూలం. ఇదే ఈ కథ మనకిచ్చే సందేశం. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)