Breaking News

ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!

Published on Sun, 07/12/2026 - 12:41

భారతీయ వివాహాలు అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పెళ్లి కూతురు అలంకరణ అంటే..అందరి దృష్టి ఆమెపైనే అన్నంత అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కళ్లు చెదిరిపోయే రేంజ్‌ ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే వస్త్రాలంకరణ తప్పనిసరి. అలాంటిది ఈ కంటెంట్‌ క్రియేటర్‌ పెళ్లి కూతురు రూపానికి సరికొత్త అర్థం ఇచ్చేలా రెడీ అయ్యింది. స్వచ్ఛతకు మరో రూపంలా కనిపించిన తీరు అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్, మేకప్‌ ఆర్టిస్ట్‌  హర్ష పత్తు నజీమ్ మహమ్మద్‌ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఆమె తన బ్రైడల్‌ షూట్‌, వివాహా వేదికకు సంబంధిచిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అవి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ఎందుకంటే ‘క్లీన్ గర్ల్’ లుక్‌లో కనిపించడం విశేషం. కనీసం ఆ లుక్‌లో కూడా చెవికి ఇయర్‌ స్టడ్స్ అయినా ఉంటాయి. 

కానీ ఈ మేకప్‌ ఆర్టిస్ట్‌ హర్ష అవి కూడా ధరించలేదు. కేరళకు చెందిన ఈ వధువు ఎలాంటి బంగారం, వెండి లేదా వజ్రాల ఆభరణాలు ధరించకుండా పెళ్లి పీటల మీద నడచి తన చిరకాల ఆచారాన్ని సవాలు చేసింది. చాలా నిరాడంబరంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కనీసం ఝంకాలు, మాంగ్‌ టిక్కా, లేదా ఒక సాధారణ బిందీ వంటి ప్రాథమిక ఆభరణాలకు కూడా చోటివ్వలేదామె. స్వచ్ఛమైన పెళ్లికూతురు ఇలానే ఉంటుంది అని చాటిచెప్పేలా ముస్తాబైంది. 

ఆఖరికి మేకప్‌ విషయంలో కూడా నేచురల్‌గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎలాంటి ఆభరణాలు ధరించకపోయినా..పెళ్లికూతురు దుస్తులు పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉండగలవని తన ఆహార్యంతో నిరూపించిందామె. ఆమె పెళ్లి కూతురు లుక్‌ని హైలెట్‌ చేసింది ధరించిన చీర. హర్ష ధరించిన శారీ రిచ్‌గా డిటైల్డ్‌గా ఉండటమే దీనికి కారణం. సాధారణంగా నవవధువు ధరించే ఎరుపు రంగునే ఎంచుకుంది. 

ఇక్కడ హర్ష్‌ దానిపై క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ, ఫుల్-స్లీవ్ బ్లౌజ్‌తో స్టైల్ చేశారు. అలాగే ఆభరణాలు, మేకప్‌ లేకుండా కనిపించినప్పటికీ..ఓ విలక్షణమైన పెళ్లి కూతురు లుక్‌తో అక్కడున్న వారందర్నీ ఆకట్టుకోవడం విశేషం. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో సైతం ఇలానే నిరాడంబరమైన లుక్‌తో అలరించింది. నెటిజన్లు సైతం ఆమె లుక్‌కి ఫిదా అవుతూ..ఆభరణాలు లేని అందమైన వధువు అంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?)

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)