Breaking News

Indo-Pak war సగం పర్యటనలు రద్దు, భారీ నష్టం

Published on Wed, 05/14/2025 - 11:18

వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో సరదాగా పొగ మంచు అందాలు, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలని అనుకున్న నగర పర్యాటకులు అంతర్మథనంలో పడ్డారు. పహల్గాం ఉగ్రదాడి యావత్‌ దేశాన్ని కదిలించింది. తరువాత పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఉత్తర భారత దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే ఎలా ఉంటుందో అనే ఆందోళన నగరవాసుల్లో కనిపిస్తోంది. దీంతో చాలా మంది తమ పర్యటనలను రీ షెడ్యూల్‌ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది పర్యాటకులు పర్యటనలను రద్దు చేసుకోడానికే మొగ్గుచూపుతున్నారని ట్రావెల్‌ ఏజన్సీలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు మాత్రం వేరే ప్రాంతాలకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. తాజాగా రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించడం, పలువురు సెలబ్రిటీలు సైతం ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో పర్యటించడంతో పరిస్థితులు సద్దుమణిగాయనే అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా వెళ్లి రావడానికి మరికొందరు మొగ్గుచూపుతున్నారు.  – సాక్షి, సిటీబ్యూరో 

ఉత్తర భారతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగా ప్లాన్‌ చేసుకున్న యాత్రికులకు ఉగ్రదాడి అనంతరం పర్యటనలను వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకోడానికి మొగ్గుచూపుతున్నారు. మా సంస్థలోనే వెయ్యికి పైగా బుకింగ్స్‌ ఉండేవి. విమానాల రద్దుతో పర్యాటకులు తమ టూర్‌ ప్లాన్‌ను మార్చుకున్నారు. దీంతో ట్రావెల్‌ ఏజెన్సీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గత 25 ఏళ్లుగా వేలాది మంది పర్యాటకులను పంపిస్తున్నా ఎన్నడూ ఈ స్థాయి ఒడిదుడుకులు చూడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరభారత దేశం అంటే యాత్రికులు అంత సుముఖంగా లేరు. రెండు రోజుల క్రితం ప్రధాని ప్రజలకు భరోసా కలి్పంచడంతో పరిస్థితులు కొద్దివరకూ మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. పూర్వ వైభవం రావడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నాం. – ఆర్‌వి రమణ, ఆర్‌వీ ట్రావెల్స్‌ ఛైర్మన్, హైదరాబాద్‌

కుటుంబంతో కలసి నాలుగు రోజుల టూర్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకున్నాం. మొన్నటి వరకూ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దేశ సైనికుల పోరాటం ఫలించింది. తాజాగా పర్యటనకు కొంత మెరుగైన వాతావరణం కనిపిస్తోంది. ట్రావెల్‌ ప్రతినిధులతోనూ సంప్రదించాం. సానుకూలంగానే స్పందించారు. వెళ్లవచ్చని భావిస్తున్నాం. – ప్రసాద్, ఉద్యోగి, హైదరాబాద్‌ 

శ్రీనగర్, కశ్మీర్‌ యాత్రకు ప్లాన్‌ చేసుకున్నాం. ఉగ్రదాడి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మా పర్యటన ప్లాన్‌ రద్దు చేసుకున్నాం. ప్రస్తుతం శాంతియుత వాతావరణం కనిపిస్తోంది. నెలాఖరులోగా వెళ్లి రావడానికి ప్లాన్‌ చేసుకుంటున్నాం. భూతల స్వర్గమైన కశ్మీర్‌ ప్రాంతంలో ఉగ్ర దాడులు జరగడం బాధాకరం. పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. – సుమిత్ర దేవి, హైదరాబాద్‌ 

ఇదీ  చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?

విమానం రద్దయ్యింది..
భాగ్యనగరం నుంచి ఈ వేసవిలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కశ్మీర్, రాజస్థాన్, చార్‌ధామ్, రిషీకేశ్, జమ్మూ, శ్రీనగర్, సిమ్లా, డల్‌ హౌసీ, కాట్రా వైష్ణోదేవి ఆలయం, శ్రీనగర్, గుల్మార్గ్, లేహ్, ముస్సోరీ తదితర ప్రాంతాలకు సుమారు పదివేల మందికిపైగా ముందస్తు బుకింగ్‌ చేసుకున్నట్లు పర్యాటక ఏజన్సీల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ చివరి వారంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సుమారు 50 శాతం మంది తమ టూర్‌ ప్లాన్స్‌ రద్దుచేసుకుందామనే ఆలోచనకు వచ్చారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన నెలకొనడంతో ఎక్కువ మంది తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. మరో వైపు రైలు, విమాన సర్వీసులు రద్దు చేయడం, రవాణా సదుపాయాలు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా అనేక మంది తమ గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో పర్యాటకులు సైతం తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత వరకూ శాంతించడంతో తిరిగి ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి.  

చదవండి: అలా రిటైర్మెంట్‌ ..ఇలా ఆధ్యాత్మిక సేవ, కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)