Breaking News

ప్రతి బిడ్డ కల ఇది..! వీడియో వైరల్‌

Published on Sun, 07/06/2025 - 14:44

తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్లు కోరుకున్న చదువు అందుకోవాలని ఆస్తిపాస్తులను అన్నింటిని అమ్మి, అప్పుల్లో కూరుకుపోడవడానికి కూడా సిద్ధపడతారు. అయితే పిల్లలు మంచి పొజిషన్‌లో సెటిల్‌ అ‍య్యాక తమ తల్లిదండ్రుల చేసిన త్యాగాలను మరవకుండా..వారిని మంచిగా చూసుకుంటే అదే పదివేలు వారికి. ఇక్కడ అలానే ఓ కుమారుడు తన తల్లిదండ్రుల త్యాగాలకు సరైన ఫలితం దక్కాలని ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. బంధాల విలులకు సరైన నిర్వచనం ఇది కదా అనిపిస్తుంది. 

అమిత్ కశ్యప్ అనే టెకీ తన తల్లిందడ్రులను విమానంలో లాస్‌ వేగాస్‌ తీసుకువచ్చాడు. ఎన్నడు తమ ఊరు నుంచి బయటకు రానివారు తొలిసారి కొడుకుతో కలిసి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్‌ ఎక్కారు. ఆ వృద్ధ తల్లిదండ్రులు విమానం కిటికీలోంచి చూస్తున్న దృశ్యాలు, వాళ్ల ముఖకవళికలను ఓ వీడియోల రికార్డు చేసి మరి షేర్‌ చేసుకున్నారు కశ్యప్‌. 

అలాగే లాస్‌ వేగాస్‌లో అడుపెట్టాక ఓ కారులో ఇరువురు రద్దీగా ఉండే వీధులు, జీవన విధానం తిలకిస్తున్న దృశ్యాలు వంటివి వీడియోలో కనిపిస్తాయి. అంతేగాదు పోస్ట్‌లో తన తల్లిదండ్రులు ఎప్పుడు ఊరి విడిచిపెట్టలేదని, అయితే పెద్ద పెద్ద కలలు కంటున్న కొడుకుని వెన్నుతట్టి ప్రోత్సహించారని అన్నారు. 

దాని ఫలితం వారికి అందించాలనే ఇలా చేశా అని రాసుకొచ్చారు. అంతలా మనకోసం అన్నింటిని వదులుకున్న మన తల్లిందండ్రులకు నిశబ్దంగా వారు ఊహించనిది ఇవ్వాల్సిన బాధ్యత మనదే అని అన్నారు. నెటిజన్లు కూడా ఇది ప్రతిబిడ్డ కల అని, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు.

 

(చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్‌ క్లాస్‌ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్‌..)

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)