Breaking News

హీరోయిన్ హోట‌ల్ ముందు భారీ క్యూ

Published on Tue, 01/27/2026 - 18:00

న‌చ్చిన వాటిని ద‌క్కించుకోడానికి 'క్యూ' క‌ట్ట‌డం మ‌న దేశంలో స‌ర్వ సాధార‌ణం. అభిమాన హీరో సినిమా విడుద‌లైన‌ప్పుడు టికెట్ల కోసం ధియేట‌ర్ల ముందు క్యూలో ఉంటాం. కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు ఆపిల్ దుకాణాల ముందు నిల్చుంటాం. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కిలోమీట‌ర్ల వ‌ర‌కు క్యూ క‌ట్టేస్తాం. ఈ మ‌ధ్య‌న బ‌ట్ట‌లు కొనేందుకు కూడా షాపుల‌ ముందు నించుంటున్నారు జ‌నం. ఇక మ‌ద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ ఎవ‌ర్‌గ్రీన్‌. ఇక్క‌డ మీరు చూస్తున్న ఫొటోలో క‌నిపిస్తున్న క్యూ కూడా దాదాపు అలాంటిదే. కానీ డ‌బ్బులిచ్చి కొనేందుకు కాదు.. ఫ్రీగా తినేందుకు. ఇంత‌కీ అక్క‌డ ఏం పెడుతున్నారు, అంత ఫేమ‌స్సా?

ముంబై మ‌హాన‌గ‌రంలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న‌ అమ్మకై అనే రెస్ట‌రెంట్ (AmmaKai Restaurant) ముందు జ‌నం క్యూ క‌ట్టిన వీడియోను ఎక్స్‌లో డీజీ పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. కొత్త‌గా ప్రారంభ‌మైన అమ్మకై రెస్ట‌రెంట్.. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఉచిత అల్ప‌హారం ఆఫ‌ర్ చేసింది. సోమ‌వారం ఉద‌యం 9.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ పెడ‌తామ‌ని ప్ర‌క‌టించింది. ముందుగా వ‌చ్చిన వారికి మాత్ర‌మే వ‌డ్డిస్తామ‌ని ష‌ర‌తు పెట్టింది. ఇది చూసిన జ‌నం రెస్ట‌రెంట్ ముందు ఉద‌యం 7 గంట‌ల నుంచే బారులు తీరారు.

బిచ్చ‌గాళ్ల మాదిరిగా..
ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన యూజ‌ర్.. జ‌నం తీరుపై విమ‌ర్శలు ఎక్కుపెట్టారు. ఉచితంగా అల్పాహారం పెడ‌తామంటే జ‌నం బిచ్చ‌గాళ్ల మాదిరిగా రెస్ట్‌రెంట్ తెర‌వ‌డానికి 2 గంటల ముందే క్యూ క‌ట్టార‌ని ఫైర్ అయ్యారు. లైనులో నిల్చున్న వారిని చూస్తే.. ఎవ‌రూ పేద‌వారులా క‌నిపించ‌లేద‌న్నారు. క‌నీసం రెండుమూడు కోట్ల రూపాయ‌ల విలువైన ఫ్లాట్ల‌లో నివసిస్తున్న ల‌క్ష‌ధికారుల్లా క‌నిపిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఫ్రీగా వ‌స్తుందంటే చాలు వెనుకాముందు చూడ‌కుండా ఎగేసుకుని వ‌చ్చేస్తారంటూ నిష్టూర‌మాడారు. ఒక ప్లేట్ బ్రేక్‌ఫాస్ట్ కోసం సిగ్గు లేకుండా రోడ్డుపై గంట‌ల త‌ర‌బ‌డి కిలోమీట‌ర్ల మేర క్యూలో నిల‌బ‌డ్డార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 'ప్ర‌జ‌ల‌కు ఉచిత ప‌థ‌కాలు ఇస్తున్నందుకు ప్ర‌భుత్వాల‌ను త‌ప్పుబ‌డ‌తాం. కానీ దానికి మ‌న బాధ్య‌త ఉంద‌ని అనుకోం. మ‌న‌ ఆలోచనలు మారకపోతే, దేశం ఇలాగే ఉంటుంద‌'ని ఎక్స్‌లో రాశారు. ఫ్రీగా వ‌స్తుందంటే జ‌నం ఇలాగే ఎగ‌బ‌డ‌తార‌ని నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు. 

అమ్మకైగా మారిన బాస్టియన్
ఇంత‌కీ అమ్మకై రెస్ట‌రెంట్ ఎవ‌రిదో తెలుసా? ఒక‌ప్ప‌టి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిదే ఈ హోట‌ల్‌. మూడేళ్ల క్రితం బాస్టియన్ బాంద్రా పేరుతో రంజిత్ బింద్రాతో క‌లిసి ఈ రెస్ట‌రెంట్ ప్రారంభించారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో దీన్ని మూసివేస్తున్న‌ట్టు ఎక్స్‌లో శిల్పా శెట్టి ప్ర‌క‌టించారు. ఎందుకు మూసివేస్తున్నార‌నే విష‌యాన్ని ఆమె వెల్ల‌డించ‌లేదు. 60 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నందుకే శిల్పాశెట్టి ఈ హోట‌ల్ మూసేస్తున్నార‌ని అప్ప‌ట్లో మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా ఈ హెటల్‌ను కొత్త‌గా మార్చి అమ్మకై పేరుతో మ‌ళ్లీ ప్రారంభించారు. ప్ర‌మోష‌న్ కోసం ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ ఆఫ‌ర్ (Free Breakfast Offer) పెట్టార‌ని ముంబై జ‌నం అనుకుంటున్నారు. 

చ‌ద‌వండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. అమ్మాయి ప్లాటయింది!

Videos

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

100 మంది 10 నిమిషాల్లో. కడపలో TDP చేసిన విధ్వంసం

Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే

YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు

నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్

Photos

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ సావిత్రి బేబీ బంప్‌ స్టిల్స్ (ఫొటోలు)

+5

మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు