Breaking News

గజగజలాడే చలిలో వెచ్చదనంతో కూడిన దయ..!

Published on Mon, 01/26/2026 - 11:30

గజగజలాడే చలిలే కాసింత వెచ్చదనం ఇచ్చే హాయి అంత ఇంత కాదు. వసంత పంచమి తర్వాత హిమచల్‌ప్రదేశ్‌ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో దట్టమైన హిమపాతంతో పరుచుకున్న​ సంగతి తెలిసింది. అక్కడున్న చాలా గ్రామాలు మంచుదుప్పటి కప్పుకున్నాయా..? అన్నంతగా మంచు కురుస్తుంది. పాపం పర్యాటకులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో ఈ మంచు తుఫానులో చిక్కుకున్నారు.వారి కార్లన్నీ రోడ్లపై దిగ్బంధించి ఉన్నాయి. విద్యుత్‌, నీటి సరఫరా అంతరాయంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి పర్యాటకులు. ఈ విపత్కర సమయంలో స్థానికులు స్పందించిన విధానం నెటిజన్లు హృదయాలను దోచుకుంది. 

ఇటీవల సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రతీది రీల్స్‌లా మారిపోయింది. కానీ ఇక్కడ స్థానికి మహిళలు చాలా నిశబ్దంగా మంచు తుఫానులో చిక్కుకున్న పర్యాటకులకు వెచ్చటి చాయ్‌ని అందించి స్వాంతన చేకూర్చారు. మనాలీ సమీపంలోని గోజ్రా గ్రామానికి చెందిన స్థానిక మహిళలు గడ్డకట్టిన వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం చేయడానికి వేడినీటి ప్లాస్క్‌లతో బయటకు వచ్చి వారికి సర్వ్‌ చేయడం విశేషం. 

ఎక్కడా.. హడావిడి గానీ హంగామా గానీ లేదు..సౌమ్యంగా సహాయం చేస్తున్న విధానం అందరి మనసులకు హత్తుకుంది. గణతంత్రపు దినోత్సవం ప్లస్‌ వారాంతపు సెలవు కలిసిరావడంతో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. సరిగ్గా దానికి తగ్గట్టు కఠినమైన వాతావరణం ఇబ్బంది పెడితే.. స్థానికులు మాత్రం ఆతిథ్యంతో 'స్వచ్ఛమైన హిమచల్‌ స్ఫూర్తి'ని కనబర్చి మానవత్వం చాటుకోవడం అందర్నీ ఆకర్షించింది. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది పర్యాటకానికి సంబంధించిన రీల్స్‌ కాదు..నిశబ్దంగా చెబుతున్న మానవత్వపు చర్య ఇది అంటూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: 'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!)

 

Videos

రీల్స్ చేయను క్షమించండి..

టీడీపీ గూండాల బరితెగింపు.. డెయిరీ ఫామ్ ను కూల్చేసి.. 26 గేదలను..

20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం

తిరుమల లడ్డూపై జడ శ్రవణ్ సంచలన ప్రెస్ మీట్

కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..

సొమ్మొకడిది సోకొకడిది.. తండ్రీకొడుకుల భజన చూసి నవ్వుతున్న నెటిజన్లు

11 మంది తెలుగు వారికి పద్మ అవార్డులు

మోత మోగిస్తున్న వెండి.. భయపెడుతున్న బంగారం

100 కోట్ల భూమిపై కన్నేసిన టీడీపీ నేత

థ్రిల్లింగ్ ట్విస్ట్ కు వెంకీ రెడీ!

Photos

+5

Medaram Jatara 2026 : మేడారం జాతరలో భారీ భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)

+5

అనిల్‌ రావిపూడికి ఒక రేంజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు

+5

తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)