Breaking News

అనురాగ్‌ కశ్యప్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?

Published on Tue, 06/30/2026 - 12:33

కొన్ని వెయిట్‌లాస్‌ స్టోరీలు స్ఫూర్తిదాయకంగా ఉన్నా..అందరికీ సరిపడవు. ఆయా వ్యక్తిగత సమస్యలు, వైద్య నిపుణుల పర్యవేక్షణ ఆధారంగా ప్రయత్నించాలే తప్ప..లేదంటే అసలుకే ప్రమాదం. ఇక్కడ సినీ నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ అలాంటిదే. ఆయన గుండెపోటుకి గురై కోలుకున్న తర్వాతా దాదాపు 27 కేజీల బరువు తగ్గారు. ఈ అద్భుతమైన మార్పు అందరికీ స్ఫూర్తినిచ్చినప్పటికీ..ఆయన ఫాలో అయిన డైట్‌ మంచిదేనా అనే సందేహాలు వెల్లువెత్తాయి. మరి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ఒక్కోసారి ఆరోగ్య సమస్యల రీత్యా క్రాష్‌డైట్‌లు ఫాలో అవ్వొచ్చా అంటే..

అనురాగ్‌ కశ్యప్‌ గుండెపోటు తర్వాత చాలా తక్కువ టైంలోనే అనూహ్యంగా బరువు తగ్గారు. అది కూడా ఇంత వేగంగా అందులోనూ గుండె సంబంధిత సమస్య నుంచి కోలుకున్నాక..ఇది సరైనదేనా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే వైద్యులు అది ఆయన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక డైట్‌ అని అంటున్నారు. అలాంటి క్రాష్‌ డైట్‌లు అందరికీ సరిపడవని హెచ్చరిస్తున్నారు. 

ఆయనకి ఉన్న రుగ్మతల దృష్ట్యా నిపుణుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలతో అనుసరించిని డైట్‌ అని చెప్పారు. ఇలా గుండెపోటు వచ్చిన వాళ్లందరికి ఇలాంటి క్రాష్‌ డైట్‌లు సరిపడవని హెచ్చరించారు. పైగా అది మేలు కంటే కీడే చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు. అలాగే ఇక్కడ ప్రతి రోగి కోలుకోవడం అనేది అప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మందులు, పోషకాహార స్థితి, మొత్తం గుండె పనితీరు వంటి అంశాల ఆధారపడి ఉంటుందన్నారు. ఇక్కడ కశ్యప్‌కు ఆస్తమా చరిత్ర, స్టెరాయిడ్ల వాడకం ఉంటం వల్ల వైద్య బృందం ఆయనకు లిక్విడ్‌ క్రాష్‌ డైట్‌ని సూచించిందని చెప్పారు. 

గుండెపోటు తర్వాత క్రాష్‌డైట్‌ ఎందుకు మంచిదికాదంటే..
గుండెపోటు తర్వాత, గుండె కండరం ఇంకా కోలుకుంటూ ఉంటుంది. ఇ‍క్కడ క్రాష్‌ డైట్‌లో కేలరీలను తీవ్రంగా పరిమితం చేస్తారు. ఫలితంగా శరీరంపై అదనపు ఒత్తిడిని తగ్గించి, సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన కేలరీల పరిమితి కండరాల క్షీణత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అలసట, తలతిరగడం వంటి సమస్యలు కోలుకోవడంలో ఆలస్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని అంటుఉన్నారు.

గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎలా బరువు తగ్గాలంటే..
గుండెపోటు తర్వాత వేగంగా బరువు తగ్గడానికి నిశితమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న చాలా మంది రోగులకు వారానికి సుమారు 0.5 నుంచి 1 కిలోల చొప్పున క్రమంగా బరువు తగ్గడం సురక్షితమని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడే నిలకడైన ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం మంచిదంటున్నారు.  

గుండెకు మేలు చేసే ఆహారం

  • పీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు

  • చేపలు, పప్పుధాన్యాలు, స్కిన్‌లెస్‌ కోడి మాంసం వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్

  • ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులు
    రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి తక్కువ ఉప్పు ఉన్న భోజనం

  • అలాగే ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప, తీవ్రమైన ఉపవాసాలు, డిటాక్స్ ప్రణాళికలు,  జీరో-కార్బ్ డైట్‌లను సాధారణంగా నివారించాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే..

  • అకస్మాత్తుగా నీరసించడం

  • గుండె దడ

  • నిరంతర నిర్జలీకరణం

  • తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం

  • మానసిక గందరగోళం లేదా అయోమయం

ఈ లక్షణాలను మనం అనుసరిస్తున్న ఆహార నియమం శరీరంపై అధిక ఒత్తిడిని కలిగిస్తోందనేందుకు సూచనగా గుర్తెరగాలి.

అందువల్ల గుండెపోటు నుంచి కోలుకుంటున్న ఎవరైనా క్రాష్ డైట్‌లకు దూరంగా ఉండాలని, బదులుగా సమతుల్య పోషణ, నిలకడ అనుసరించి చక్కటి జీవనశైలిని పాటించాలని చెబుతున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు నిలకడగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఇక్కడ గుండెను కాపాడుకోవడం అంటే త్వరగా బరువు తగ్గడం కాదు, సురక్షితంగా బరువు తగ్గడం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.

(చదవండి: ఐఐటీ డ్రాపౌట్‌ అయినా..మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లో ఉద్యోగం!)

 

 

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)