Breaking News

Health: షుగర్‌ పేషెంట్లకు ఆరోగ్య ఫలం! ఒక్క గ్లాసు జ్యూస్‌ తాగితే 15 నిమిషాల్లో..

Published on Sat, 11/05/2022 - 09:54

Health Tips In Telugu- Diabetes: ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని 15 నిమిషాల్లో తగ్గించవచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న డయాబెటిక్‌ పేషెంట్లను రెండు గ్రూపులుగా విభజించి, వారిలో ఒక గ్రూప్‌నకు 230 మిల్లీలీటర్ల చక్కెర నీళ్లు, మరో గ్రూప్‌నకు 230 మిల్లీలీటర్ల దానిమ్మ జ్యూస్‌ ఇచ్చారు. దానిమ్మ జ్యూస్‌ తీసుకున్న వారిలో 15 నిమిషాల వ్యవధిలోనే షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోగా, చక్కెర నీళ్లు తీసుకున్న వారి షుగర్‌ లెవల్స్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు.

ఆరోగ్య ఫలం దానిమ్మ
►దానిమ్మలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి.
►ఇది గ్రీన్‌ టీలో, రెడ్‌ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కంటే మూడు రెట్లు అధికం.
►ఈ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్‌ లేదా ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే వ్యాధులతో పోరాడతాయి.

►దానిమ్మ గింజలు ఇన్సులిన్‌ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి.
►అందుకే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరమైన ఫలంగా చెప్పవచ్చు.
►అంతేకాదు... దానిమ్మలో చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్థాలుంటాయి.

►100 గ్రాముల దానిమ్మలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌) కేవలం 19 శాతం మాత్రమే.
►కాబట్టి కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా ఉండే దానిమ్మపండు మధుమేహులకు చాలా ప్రయోజనకరమైన పండు అని నిపుణులు చెబుతున్నారు. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!

చదవండి: Health: పొద్దు పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? పరిష్కారాలు.. ఉడికించిన పప్పు తింటే
What Is Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు.. ఫిట్స్‌కి కారణాలివే!
Diabetes- Best Diet: షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఉత్తమమైన ఆహారం ఇదే!.. దేశీ ఫలాలు తింటే

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)