Breaking News

ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్‌కట్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌

Published on Sun, 05/24/2026 - 12:00

బరువు తగ్గడం అనగానే కఠినమైన వ్యాయామాలు, స్ట్రిక్ట​ డైట్‌నే ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఇలా ఎప్పుడైతే శరీరాన్ని ఒకేసారి కష్టపెడతామో అదికాస్తా సహకరించడానికి బదులుగా వ్యతిరేకించడం మొదలుపెడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం దేవుడెరుగు మొత్తానికి మరిన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వుతాయని అంటోంది ఈ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌. చిన్నచిన్న మార్పులే అద్భుతం చేస్తాయని..త్వరిగతిన బరువు తగ్గుతామని అంటున్నారామె. అదెలాగంటే..

ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్‌ కేవలం ఐదు నెలల్లో 30 కేజీలు తగ్గారు. అందుకోసం ఎలాంటి టెక్నిక్స్‌ ఫాలో అయ్యారో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారు. నిజానికి కఠినమైన వ్యాయామాలు, డైట్‌లు త్వరిగతగతిన అలిసిపోయేలా చేసి, బరువు తగ్గడాన్న మధ్యలోనే వదిలేస్తారని చెబుతోందామె. అదే చిన్నగా శరీరం అలవాటుపడేలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే అద్భుతమైన ఫలితాలు పొందుతామని అంటోంది. తానేమి కఠినమైన డైట్‌లు, రెండు గంటల జిమ్‌ సెషన్‌లు వంటివి చేయలేదన్నారామె. 

తాను అనుసరించిన విధానం అందరు చూసి నవ్వేలా, సిగ్గుపడేంతగా మొదలైందని చెబుతోంది. అంటే అంతా రోజూ పదివేల అడుగులతో దినచర్య మొదలుపెడితే, తానే కేవలం 4000 అడుగులతో తన వెయిట్‌లాస్‌ని మొదలుపెట్టానని అంటోంది. ఎందుకంటే అధిక బరువు ఉన్నవాళ్లకు ప్రారంభంలోనే అధిక వర్కౌట్లు సమస్యాత్మకమవుతాయని అంటోందామె. శరీరం మనం చేసే వ్యాయామాలకు అలవాటుపడుతుందనగా, నెమ్మదిగా, నిధానంగా వర్కౌట్లు, అడుగులు పెంచాలని సూచిస్తోంది. 

ఇక్కడ లక్ష్యం కేవలం కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం కాదని అంటోంది. అలాగే ఆయాసం, శ్రమతో కూడిన విధంగా వర్కౌట్లు చేయొద్దని అంటున్నారు. సంతోషంగా ఎంజాయ్‌ చేసేలా మొదలుపెట్టండి, బాడీ అలవాటు పడుతుందనగా చిన్నగా కార్డియోసెషన్‌ వంటి వేగవంతమైనవి మొదలు పెట్టమని అంటోంది. అలా చేయడం వల్ల కీళ్లు మరింత బలపడతాయి, తెలియకుండానే ఆ వర్కౌట్లకు అలవాటుపడేలా కోలుకుంటారు. 

అదీగాక భారాన్ని తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. నెమ్మదగా దశల వారీగా సాగే ప్రక్రియని, రాత్రికి రాత్రే జరిగేది కానీ తేల్చి చెప్పారామె. కేవలం స్థిరంగా నిదానంగా, ఓపికతో చేస్తుకుంటూ వెళ్తే..అనుకున్నది సాధ్యమవుతుందని చెబుతోందామె.

 

(చదవండి: 40 డిగ్గ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్‌గా..! ఆ ఐడియాకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా)

 

 

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)

+5

రామ్‌చరణ్‌ 'పెద్ది కీ ఆవాజ్‌' ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్‌లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు)

+5

కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)