అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్‌!

Published on Sat, 07/25/2026 - 09:25

ఒత్తిడి నుంచి బయటపడటానికో, లేదంటే తగ్గించుకోవడానికో చాలామంది స్ట్రెస్‌ బాల్‌ కానీ, స్పిన్నర్‌ కానీ వాడుతుంటారు. ఇదే స్థానంలో జ్యువెలరీ చేరితే. అందానికి అందం..  ఒత్తిడి అవుట్‌. మానసిక ఆందోళన బయటకు కనిపించకుండా తగ్గించుకోవడానికి నేటి యువత  ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ–యాంగ్జైటీ జ్యువెల్లరీ. దీనినే ఫిడ్జెట్‌ జ్యువెలరీగా కూడా పిలుస్తారు.

స్పిన్నర్ల ఆధునిక, స్టైలిష్‌ రూపమే ఈ ఫిడ్జెట్‌ జ్యువెల్లరీ! రింగులు, చైన్లు, బ్రాస్‌లెట్ల రూపంలో లభించే ఈ ఆభరణాలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందించే సాధనాలుగానూ ఉపయోగపడుతుండటంతో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి. సాధారణ నగలకు భిన్నంగా, వీటిలో చిన్న΄ాటి కదలికలు ఉండేలా డిజైన్‌ చేస్తారు. ఈ ప్రత్యేకతే స్ట్రెస్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

స్పిన్నర్‌ రింగ్స్‌: ఉంగరానికి పైన ఉండే సన్నని బ్యాండ్‌ లేదా పూసలు వేలితో తిప్పేలా ఉంటాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వేళ్లతో వాటిని తిప్పడం వల్ల మనస్సు క్షణాల్లో వేరే వైపు మళ్లుతుంది.

బ్రీథింగ్‌ పెండెంట్లు: లాకెట్‌ లాంటి చిన్న ప్లాటినం లేదా స్టీల్‌ గొట్టాల డిజైన్‌తో వీటిని రూ΄÷ందిస్తారు. ఒత్తిడి పెరిగినప్పుడు సాధారణంగా ఊపిరి తీసుకుని, ఈ గొట్టం ద్వారా నెమ్మదిగా వదలడం వల్ల శరీరం వెంటనే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.

అరోమాథెరపీ జ్యువెల్లరీ: నూనెలను పీల్చుకునే లావా స్టోన్స్‌ కలిగిన ఈ నగలు, సువాసనల ద్వారా మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒకప్పుడు కేవలం అలంకారానికే పరిమితమైన ఆభరణాలు, నేడు మానసిక ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుండటం విశేషం. ఇవి ప్లాస్టిక్‌ బొమ్మల వలే కాకుండా గోల్డ్, సిల్వర్, స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌లో అత్యంత మినిమలిస్టిక్‌ డిజైన్లలో వస్తుండటంతో ఫ్యాషన్‌ ప్రేమికులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)