Breaking News

నాన్నకు ప్రేమతో..! వైరల్‌గా కూమార్తె పోస్ట్‌..

Published on Sat, 07/04/2026 - 17:14

అందర్నీ ఆలోచింపచేసేలా నెట్టింట చక్కెర్లు కొడుతున్న పోస్ట్‌ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతలా తమ సర్వస్వం ధారపోస్తారో తెలియజేసే ఓ కూతురు పోస్ట్‌ ఇది. ఆమె పోస్ట్‌లో నాన్న త్యాగాలు గురించి రాసిన విధం చూడగానే ఠక్కున జూనియర్‌ ఎ‍న్టీఆర్‌ నటించిన నాన్నకు ప్రేమతో మూవీలోని
ఏ కష్టమేదురోచ్చినా
కన్నీళ్ళు ఎదిరించినా 
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన 
నాన్నకు ప్రేమతో, 
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం అనే పాట గుర్తుకొస్తుంది. అంత భావోద్వేగంగా నాన్న గురించి రాసుకొచ్చిందామె పోస్ట్‌లో.

ఇన్‌స్టాగ్రామ్‌ 'Growing with Artha' అనే ఖాతాలో షేర్‌ చేసిన వీడియలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ వీడియో వేలాదిమంది మనసులను తాకింది. ఆ కూతురు  పోస్ట్‌లో తన తండ్రి గురించి ఇలా రాసుకొచ్చింది. " మా నాన్న 35 ఏళ్లకు పైగా ఆటో రిక్షాని నడుపుతున్నారు. అందువల్లే తనకు తనకు మంచి విద్య, స్వతంత్ర, మంచి కెరీర్‌ లభించాయని అంటోంది. నర్సరీ స్థాయి నుంచి డిగ్రీ వరకు నా చదువు ఆయన కఠిన శ్రమ వల్లే సాధ్యమైంది. 

మా చుట్టుపక్కల చాలా మంది తమ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం డబ్బు దాచుకుంటున్న సమయంలో, మా నాన్న మాత్రం మా చదువుపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన నాకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి విద్య కాదు, స్వతంత్రత. నాకు ఒక ఒక సోదరి కూడా ఉంది. ఆడపిల్లలమని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఒంటిరిగా ప్రయాణించడం నుంచి సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ఎదుర్కోవడం వంటి విషయాల వరకు ప్రతిదాంట్లో మాపై నమ్మకం ఉంచారు. 

తాను తన సోదరి ఇద్దరం కెరీర్‌లో బాగా రాణించాం. కోవిడ్ మహమ్మారి సమయంలో, తమ తల్లిదండ్రులకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక  వ్యవసాయ క్షేత్రాన్ని (ఫామ్) ప్రారంభించాం అప్పటి నుంచి, ఆయన దాని బాగోగులు స్వయంగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత నాకు పెళ్లై తల్లిగా మారాక ఉద్యోగం కొనసాగించాలా వద్ద అనే క్లిష్టమైన నిర్ణయం తీసుకునే సమయంలో కూడా నాకు అండగా నిలిచారు. పైగా నా కెరీర్‌ని వదులుకోవద్దని ప్రోత్సహించారు. బిడ్డ పెంపకంలో మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ఉద్యోగం మానేయకు' అని చెప్పారు.  అంతేకాకుండా, నాతో ఉండటానికి మా అమ్మను పంపించారు. నేను ఆఫీసుకి వెళ్ళినప్పుడు నా కూతురిని చూసుకోవడానికి మా అమ్మ ప్రతి వారం బెంగళూరుకు వస్తుంటారు. ఆమె తల్లి బిడ్డను చూసుకోవడంలో సహాయం చేస్తుండగా, ఆమె తండ్రి ఇంట్లో అన్ని పనులూ ఒంటరిగా చూసుకుంటారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి చెందిన కిరాణా దుకాణాన్ని నడుపుతారు, పొలాన్ని చూసుకుంటారు, వంట చేస్తారు, దాంతోపాటు పగటిపూట తన ఆటో నడుపుతూ సాయంత్రం తిరిగి వచ్చి దుకాణాన్ని తెరుస్తారు. 

దీన్ని బట్టి నాకో విషయం అర్థమైది. తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, ఒక బిడ్డను స్వతంత్రంగా పెంచి తర్వాత వారికి అండగా నిలబడటమే. నాకు మాత్రం ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు అందుకు మా నాన్న సదా ధన్యావాదాలు. అంటూ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్ల సైతం ఆమె పోస్ట్‌ మద్దతిస్తూ..నిజమైన హీరో నాన్నే అంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: యుద్ధం భర్తను దూరం చేస్తే..సాంకేతికత చేరువ చేసింది!)

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)