వైభవంగా గియాన్‌ మత్సూరీ సంబరాలు..

Published on Sun, 07/19/2026 - 10:31

జపాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం గియాన్‌ మత్సూరీ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై నెల మొత్తం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. యాసకా ఆలయానికి సంబంధించిన ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన భారీ రథాల ఊరేగింపు జూలై 17న ప్రారంభమైంది. అంగరంగవైభవంగా నిర్వహించే ఈ వేడుకలను వీక్షించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు క్యోటో నగరానికి క్యూకట్టారు.

దైవదూతగా స్థానిక బాలుడు!
క్రీస్తుశకం 869లో నగరంలో వ్యాపించిన ఒక తీవ్రమైన అంటువ్యాధి నుంచి తమను రక్షించాలని దేవుళ్లను వేడుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలను నిరంతరాయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండుగలో ఇప్పటికీ ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు. ఒక స్థానిక బాలుడిని దైవదూతగా ఎంపిక చేస్తారు. ఆ బాలుడు జూలై 13 నుంచి 17వ తేదీన ఊరేగింపు పూర్తయ్యే వరకు నేలపై కాలు మోపరాదనే కఠినమైన నియమం పాటించాల్సి ఉంటుంది.

ఆకట్టుకునే భారీ రథాలు
ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనది భారీ రథాల ఊరేగింపు. ఈ ఊరేగింపులో యమ, హొకో అనే రెండు రకాల రథాలను ఉపయోగిస్తారు. ఇందులో హోకో రథాలు సుమారు 25 మీటర్ల ఎత్తు, 12 టన్నుల బరువుతో మనుషులంత పరిమాణం ఉన్న భారీ చక్రాలతో నిర్మితమై ఉంటాయి. జూలై 17న జరిగిన మొదటి ఊరేగింపులో 23 రథాలు పాల్గొంటాయి. జూలై 24న జరిగే రెండో ఊరేగింపులో మిగిలిన 10 రథాలు నగర వీధుల్లో విహరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రథాల తయారీలో ఒక్క మేకును కూడా ఉపయోగించకుండా కేవలం తాళ్లతోనే రథ భాగాలను అనుసంధానిస్తారు.

రాత్రి వేళల్లో యోయియామా బ్లాక్‌ పార్టీలు!
జూలై 17, 24 తేదీల్లో జరిగే ప్రధాన ఊరేగింపులకు ముందు వచ్చే మూడు సాయంత్రాలు క్యోటో నగరం సరికొత్త శోభను సంతరించుకుంటాయి. వీటిని వరుసగా యోయి– యామా వీధి వేడుకలుగా పిలుస్తారు. వేడుకల సమయంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఆహార శాలలు, రంగురంగుల దుకాణాలతో వీధులలో పండుగ  వాతావరణం నెలకొంటుంది. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా సాంప్రదాయ ‘యుకతా’ నూలు వస్త్రాలు ధరించి, వీధుల్లో నృత్యాలు చేస్తారు. ఈ సమయంలోనే స్థానిక ప్రజలు తమ ఇళ్ల తలుపులు తెరిచి, తమ వంశపారంపర్యంగా వస్తున్న పురాతన వస్తువులను ప్రదర్శించే ‘బ్యోబు మత్సూరీ’ అనే వేడుక కూడా ఈ సమయంలోనే జరుగుతుంది.
- రమా జంబుల

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)