Breaking News

ఆ కారణంగానే గజినీ నటుడు ప్రదీప్ రావత్ ప్రాణం..వృద్ధాప్యంలో ఆ సమస్య తప్పదా?

Published on Wed, 08/05/2026 - 17:55

గజని పలు బ్లాక్‌బస్టర్‌ మూవీలలో విలన్‌గా తన మార్కుతో మెప్పించి ప్రశంసలందుకున్న నటుడు ప్రదీప్‌ రావత్‌ కేన్సర్‌ చికిత్స పొందుతూ మరణించారు. మంచి నటుడి పేరుతెచ్చుకున్న రావత్‌ 74 ఏళ్ల వయసులో కేన్సర్‌ కారణంగా మృతి చెందినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక్కడ ఈ నటుడి మరణంగా కీలకమైన ఆరోగ్య ప్రశ్నను లేవనెత్తింది. కేవలం వయసు పెరగడం వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా?, తప్పనిసరిగా వృద్ధాప్యంలో కేన్సర్‌ వస్తుందా అంటే..

వయసు పెరగడం వల్ల కేన్సర్‌ వచ్చే ప్రమాదం కచ్చితంగా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగని వృద్ధాప్యంలో కేన్సర్‌ అనివార్యమని చెప్పలేమని అన్నారు. జీవితాంతం మన శరీరంలోని కణాలు నిరంతరం విభజన చెందుతూ, తమను తాము బాగు చేసుకుంటాయని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ మన కణాలకు జన్యుపరమైన హాని జరగడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. 

మన శరీరం దెబ్బతిన్న DNAను రోజూ బాగు చేసుకున్నప్పటికీ, ఈ ప్రక్రియలు చివరికి వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అదే సమయంలో అదే సమయంలో, మన రోగనిరోధక వ్యవస్థ అసాధారణ కణాలు కేన్సర్‌గా మారకముందే వాటిని గుర్తించి నాశనం చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా దశాబ్దాలుగా ఈ జన్యుపరమైన మార్పులు పేరుకుపోవడంతో, అసాధారణ కణాలు వృద్ధి చెంది కేన్సర్‌గా మారే అవకాశాలు క్రమంగా పెరుగుతాయని అంటున్నారు. 

అలాగే ఒక వయసు గల ప్రతి ఒక్కరికీ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఒకేలా ఉంటుందని అపోహ పడుతుంటారు. జీవసంబంధమైన వృద్ధాప్యం, కాలక్రమేణా వచ్చే వృద్ధాప్యానికి భిన్నంగా ఉంటుందని నొక్కి చెబుతున్నారు. జీవనశైలి, కుటుంబ చరిత్ర, శారీరక శ్రమ స్థాయి, నిద్ర నాణ్యత, సాధారణ జీవక్రియ ఆరోగ్యంపై ఆధారపడి, 74 ఏళ్ల వయస్సు గల ఏ ఇద్దరు వ్యక్తులకు కేన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. 

అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ..క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారికి ఈ సమస్య తక్కువ. అలాకాకుండా అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఉంటే కచ్చితం ఈ కేన్సర్‌ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. 

వృద్ధుల్లో ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడానికి రీజన్‌..
వృద్ధులలో కేన్సర్ ఆలస్యంగా నిర్ధారణ కావడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటి, లక్షణాలను తరచుగా వృద్ధాప్యంలో సాధారణమైనవిగా కొట్టిపారేయడమేనని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నిరంతరం బరువు తగ్గడం, అసాధారణమైన అలసట, మూత్రంలో లేదా మలంలో రక్తం, తగ్గని గడ్డ, మింగడంలో ఇబ్బంది, లేదా మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే దగ్గు వంటి లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇవే కాకుండా కనిపించే ఇతర లక్షణాలు..

మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు
కారణం తెలియని రక్తస్రావం
చర్మంపై కొత్త మార్పులు
నిరంతరం గొంతు బొంగురుపోవడం
ఆకలి లేకపోవడం
రాత్రిపూట చెమటలు పట్టడం

ఈ లక్షణాలు ఎల్లప్పుడూ కేన్సర్‌ను సూచించనప్పటికీ, ఈ లక్షణాలతో ముందస్తు వైద్య పరీక్షల్లో  ఆ వ్యాధిని ముందుగా గుర్తించి సులభంగా బయటపడగలుగుతారని అంటున్నారు. చాలా కేన్సర్‌లు ప్రారంభ దశలో గుర్తిస్తే..సులభంగా చికిత్స చేయవచ్చు. ముఖ్యంగా స్క్రీనింగ్ వంటి వైద్య పరీక్షలను, సకాలంలో చేస్తే.. లక్షణాలు కనిపించకముందే కొన్ని రకాల కేన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు.

అలాగే చాలామంది డెబ్బై, ఎనభై ఏళ్ల వరకు జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ కేన్సర్‌ సర్వసాధారణం అయినప్పటికీ..వృద్ధాప్యాన్ని అనివార్య పరిణామంగా పరిగణించకూడదని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అందుకే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేలా కేర్‌ తీసుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

(చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ డైరెక్టర్‌ ..)
 
 

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)