Breaking News

రూ. 5ల బిస్కట్‌ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?

Published on Fri, 06/06/2025 - 13:11

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్‌ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.  ఆహార పంపిణి  నిలిపివేత,కరువు నేపథ్యంలో  తీవ్రమైన  ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్‌ చేసుకునేందుకు బ్లాక్‌మార్కెట్‌ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి  నెలకొంది.  

అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్‌ ప్రకారం ముంబైతె   తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ  బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి  లోనవుతున్నారు.  ఈ ధరలు  దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి  అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.

 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా  చెప్పారని  ఎన్‌డీటీవీ తన  స్పెషల్‌ రిపోర్ట్‌లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు"  "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్‌ నటి పెళ్లి, ఐవరీ కలర్‌ లెహంగాలో బ్రైడల్‌ లుక్‌!

జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలు
కిలోల చక్కెర: రూ. 4,914

వంట నూనె: రూ. 4,177

కిలో బంగాళాదుంపలు: రూ. 1,965

కిలో ఉల్లిపాయలు : రూ. 4,423

కాఫీ కప్పు: రూ. 1,800

 గత గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది.  అంతర్జాతీయ ఒత్తిడి  తరువాత  కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.

చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్‌డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)