Breaking News

శ్రీనాథ విరచిత వినాయక దండకం

Published on Sun, 09/13/2026 - 03:38

య జయ జగదేక రక్షామణీ!
దేవ చూడామణీ శ్రేణి శోణ ప్రభాజాల బాలా తప స్మేర పాదారవిందా!
ముకుందప్రియా! యిందుధారీ!
కటస్యంది దానాంబుధారా ధునీ ధోరణీ గాహ కౌతూహలాయత్త మత్త ద్విరేఫాంగనా గాన సంగీత రంగీకృతస్వాంత!
దంతావ ళాస్యా! నమస్యా! త్రిలోకైక వశ్యా! యవశ్యాయ శైలాత్మజా ధర్మసంతాన!
సంతాన కల్పద్రు పుష్పావతంసా! యసారోరు సంసార మాయాంధకారా హృతిప్రక్రియా భాస్కరా!
కోటిభాస్వన్నిరాఘాట దేహ ప్రభాభాస్వరా! దేవ! హేరంబ! లంబోదరా! యేక దంతా! మహాకాయ! సంతప్త కార్తస్వరాభా!
విశాలాక్ష మౌంజీధరా! నాగ యజ్ఞోపవీతా సమన్విత కృష్ణాజినా!
యాఖువాహా! కుఠారాయుధా! విఘ్నరాజా! గణాధ్యక్ష!
కారుణ్య లీలా కటాక్షంబునన్‌  మమ్ము వీక్షించి రక్షింపుమీ!

క్షీర వారాళి నీ మందరక్ష్మాధర స్వామి కవ్వంబుగా, నీ భుజంగాధినాథుండు సూత్రంబుగా, గచ్ఛపాధీశుడాధార పీఠంబుగా, సర్వదివ్వౌషధీ వల్లులన్‌  వైచి, నానా పదార్థంబుల న్వెన్నలం బంచుకో గోరి యున్నార, మిక్కార్య మే విఘ్నముం బొందకుండంగ, నే విక్రియం జెంద కిష్టార్థ సంసిద్ధులం గైకొనుం గాక నీ యాజ్ఞ సర్వేశ సర్వాత్మకా!
నిర్వికల్పా! నిరీహా! నిరాంతక! నిశ్శంక! యోంకార మూర్తీ! నమస్తే! నమస్తే! నమః

ఇవీ చదవండి: వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)