Breaking News

ఐసీయూలో వెంటిలేటర్‌పై తండ్రి, ఆసుపత్రిలోనే కూతుళ్ల పెళ్లి...వైరల్‌ వీడియో

Published on Tue, 06/18/2024 - 14:43

అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడబిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతీ తల్లీదండ్రి ఆశపడతారు. ముఖ్యంగా పేద, ధనిక తేడాల్లేకుండా   ప్రతీ కుటుంబంలోనూ ఉండే అత్యంత సమజమైన కోరిక. మరీముఖ్యంగా అమ్మలాంటి తన కూతురిపెళ్లిని ఉన్నంతలో ఘనం చేయాలనికోరుకుంటారు తండ్రులు.  కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయాన్ని పిండేసే రీతిలో ఒక సంఘటన జరిగింది.

లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్  సరిగ్గా కుమార్తె పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అయినా  ఆరోగ్యం కుదుట పడలేదు. ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌  కారణంగా  పరిస్థితి మరింత విషమించి ఇక్బాల్‌ ఎరా మెడికల్ కాలేజీ ఐసియులో ఉన్నాడు. అయితే తండ్రి కోరిక  మేరకు ఆయన కళ్లముందే ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ తండ్రి పరిస్థితిని గమనించిన కుమార్తెలు కూతుళ్లు దర్శా, తాంజిలా ఆస్పత్రి ఐసీయూలోనే  పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్ద,వధూవరులు ఆసుపత్రి దుస్తుల్లో..ఆసుపత్రి అధికారుల అనుమతితోనే పెళ్లి తంతు మొత్తం జరిగింది.  ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివాహాన్ని త్వరితగతిన నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆస్పత్నిని సిబ్బందిని అభినందించారు. అలాగే  నూతన వధూవరులకు ఆశీర్వాదాలందించారు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు