Breaking News

డివోర్స్‌ మెహిందీ : ఓ వివాహిత హృదయవిదారక గాథ వైరల్‌

Published on Sat, 12/14/2024 - 13:05

శుభకార్యం అనగానే మహిళలకు ముందుగా  గుర్తొచ్చేది  గోరింటాకు.  పెళ్లి అయినా, ఫంక్షన్‌ అయినా చేతి నిండా  మెహిందీ (హెన్నా) పెట్టుకుంటే ఆ వేడుకకు మరింత కళ.  ఈ మెహిందీ కళలో అనేక  రకాలను చూశాం. వాటిల్లో ప్రధానంగా బ్రైడల్ మెహిందీ. కానీ విడాకుల మెహిందీ గురించి ఎపుడైనా విన్నారా? తన వైవాహిక జీవితంలో ఎదురైన  కష్టాలు, కన్నీళ్ల గురించి ప్రస్తావిస్తూ మొత్తానికి  విడాకులు తీసుకున్నాను అంటూ తన  బాధను నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట పలువురి హదయాలను కదిలిస్తోంది.

ఊర్వశి వోరా శర్మ ఇన్‌స్టా వేదికగా విడాకుల స్టోరీని మెహిందీ డిజైన్‌ ద్వారా   అభిమానులతో పంచుకుంది. తన  విఫలమైన పెళ్లి, తన కలలు, భర్త చేసిన ద్రోహం, అనుభవించిన  క్షోభను చాలా భావోద్వేగంతో  ఈ కొత్త కాన్సెప్ట్‌ ద్వారా వివరించింది. 

కేవలం ఒక పనిమనిషిలాచూసిని అత్తమామలు, భర్త మద్దతు ఏమాత్రం లేక కుంగిపోయిన వైనం, ఒంటరితనంతో అనుభవించిన నరకం, భయంకరమైన ఒత్తిడి, చివరికి విడిపోవాలనే అంతిమ నిర్ణయంతో ముగుస్తుందీ మెహిందీ ఆర్ట్‌. దీనిపై నెటిజన్లు స్పందించారు. 

 ‘మీ బాధను వ్యక్తం చేయడానికి ఇది చాలా శక్తివంతమైన మార్గం. మీకు మరింత బలం చేకూరాలి’ అంటూ చాలామంది ప్రశంసించారు.

"మెహిందీలో నొప్పిని చూడటం హృదయ విదారకం. కానీ ఆమె సాధించిన స్వేచ్చ సంతోషానిస్తోంది’’ అని  మరొకరు వ్యాఖ్యానించారు.  

‘విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు, కానీ ఈ మెహిందీ మళ్లీ మీ జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన శక్తినిస్తుంది’

“ఇది కేవలం కళ కాదు; అది ఒక ఉద్యమం. స్త్రీలు తమ బాధలను పంచుకుంటున్నారు’’ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ‘‘ఫైనల్లీ.. మెహిందీ ద్వారా వివాహాలకు ఆవల గాథలు. ఇవి పచ్చి నిజాలు, కఠోర వాస్తవాలు’’ అంటూ మరొకరు పేర్కొనడం గమనార్హం
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)