Breaking News

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

Published on Sat, 02/22/2025 - 16:32

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు దారుడు, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను  అమెరికా ద‌ర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ  (FBI)  డైరెక్టర్‌గా  నియమించారు. ఈ సంద‌ర్భంగా భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఆయ‌న‌ ప్ర‌మాణం చేయ‌డం విశేషంగా నిలిచింది. ఈ ప్ర‌మాణ‌ స్వీకారోత్స‌వానికి కాశ్ ప‌టేల్ ప్రేయ‌సి అలెక్సీస్ విల్‌కిన్స్, ఇత‌ర కుటుంబ స‌భ్యులు హాజ‌రయ్యారు. అయితే  ఎవరీ అలెక్సీస్‌? వీరిద్దరి లవ్‌ స్టోరీ ఏంటీ అనే ఆసక్తి ఏర్పడింది. మరి ఆవివరాలేంటో చూసేద్దామా!

ప్రమాణ స్వీకారం తర్వాత, పటేల్ ప్రసంగిస్తూ,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబం,స్నేహితులకు  ధన్యవాదాలు  తెలిపాడు. వారి వల్లే తానిక్కడ ఉన్నానిని చెప్పాడు. అలాగే సోదరి నిషా  మేనల్లుడు లండన్‌ నుండి వచ్చారని పేర్కొన్నాడు.  తన అందమైన ప్రేయసి అలెక్సిస్  కూడా ఇక్కడే ఉంది అనగానే చప్పట్లు మారుమోగిపోయాయి.

 

 

కాశ్‌ పటేల్ (44) అక్టోబర్ 2022లో జరిగిన కన్జర్వేటివ్  రీఅవేకెన్ అమెరికా టూర్‌లో అలెక్సిస్ (26)ను మొదటిసారి కలిశారు. ఇద్దరూ దేశభక్తులు, వారు సంప్రదాయవాద విలువలను ఇష్టపడ్డారు. అలా వారిద్దరి పరిచయం క్రమంగా బలపడింది.  2023లో డేటింగ్ ప్రారంభించారు.

చదవండి: Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్‌ సుమ

BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు

అలెక్సీస్‌ వినాష్‌ విల్లేకు చెందిన గాయని, పాటల రచయిత్రి కూడా. అనే​​క స్వచ్ఛసంస్థలతో కలిసి పనిచేస్తోంది. 1999 నవంబర్ 3న ఆమె అర్కాన్సాస్‌లో పుట్టింది. అయితే  ఆమె బాల్యం అంతా ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోనే గడిచింది. అమెరికా వచ్చిన తరువాత యూఎస్‌మీదే, అక్కడి సంగీతం మీద ఇష్టం ఏర్పడింది.  బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో చదివి వ్యాపారం మరియు రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్  చేసింది.  కేవలం 8 ఏళ్ల వయస్సులో తన మొదటి పాటను రాయడం విశేషం.విలియమ్స్-ముర్రే రైటింగ్ అవార్డు, ఎకనామిక్ క్రిటికల్ థింకింగ్ అవార్డులను గెలుచుకుంది. 
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)