Breaking News

పెళ్లి రోజు: మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌

Published on Thu, 08/21/2025 - 10:46

మాజీ మంత్రి, వైసీపీనేత ఆర్‌కే రోజా (R K Roja) తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా విశాఖ పట్టణంలోని  సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.  భర్త రోజా ఆర్‌కే సెల్వమణి, ఇతర  కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా తన వివాహ బంధంపై సోషల్‌ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్‌ చేశారు. 

రోజా ఇన్‌స్టా పోస్ట్‌ 

❝మణి ఎదలో…
రోజా పూదోట…
అదే నింగి, అదే నేల…
అదే దివి, అదే భువి…
అదే నీరు, అదే గాలి…
నింగిలో మార్పు, నేలలో మార్పు జరిగినా...
పంచభూతాల సాక్షిగా,
మనువాడిన మణి నీ
ఎదమది తోటలో ప్రతీ రోజూ
వికసించే రోజానై
నీ వెంట…
నీ జంటగా
నిలిచాను...!!

మన 34 ఏళ్ళ ప్రయాణం
నా జీవితానికి అందమైన కానుక...
ప్రతీ క్షణం తోడుగా, బలంగా,
ప్రేమగా నన్ను నిలిపిన
మీకెప్పటికీ రుణపడి
ఉంటాను..❜

దీంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు  ఈ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఆగస్టు 21న రోజా, దర్శకుడు సెల్వమణి వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు.

ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత


 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)