Breaking News

ముచ్చటగా మూడోసారి: తన రాక్‌స్టార్స్‌కు బ్రాండ్‌ న్యూ కార్లు గిఫ్ట్స్‌

Published on Tue, 10/21/2025 - 12:46

దీపావళికి బోనస్‌లు, స్వీట్లు, గిఫ్ట్‌లు సహజమే.  కానీ ఖరీదైన బహుమతు లివ్వడం వార్తల్లో నిలుస్తాయి. తాజాగా హెల్త్‌కేర్  సంస్థ వ్యవస్థాపకుడు సామాజిక కార్యకర్త ఎంకే భాటియా  ముచ్చటగా మూడోసారి తన ఉద్యోగులకు  వచ్చిన విలువైన బహుమతులు నెట్టింట సందడిగా మారాయి.


చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ‘మిట్స్ నేచురా లిమిటెడ్‌’ కంపెనీ అధినేత ఎంకే భాటియా దీపావళి వేడుకల్లో భాగంగా తన ఉద్యోగుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉద్యోగులకు  51 సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు. స్వయంగా తాళాలు అందజేసి వారిని అభినందించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన బృంద సభ్యులకు ఎస్‌యూవీ, స్కార్పియో వంటి ఖరీదైన కార్లను అందించారు. ఎంకే బాటియా ఇలా కార్లను బహుమతిగా ఇవ్వడం వరుసగా ఇది మూడోసారి. 

ఇదీ చదవండి: గౌరీ పూజ, షారూఖ్‌ ఖాన్‌ దీపావళి శుభాకాంక్షలు, నెటిజన్లు ఫిదా!

లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో, భాటియా  ఏమన్నారంటే. ‘‘గత రెండు సంవత్సరాలుగా, అత్యంత అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చాం. అసలు వారిని ఉద్యోగులు లేదా సిబ్బంది అని ఎప్పుడూ పిలవలేదు. వారు నా జీవితంలో రాక్‌స్టార్ సెలబ్రిటీలు, మా ప్రయాణంలోని ప్రతి దశనూ బ్లాక్‌బస్టర్‌గా మార్చేసే తారలు. ఈ దీపావళి  ఎక్స్‌ట్రా స్పెషల్‌" అంటూ కార్లను హ్యాండ్ఓవర్ చేసిన ఫోటోలను షేర్‌ చేశారు. తన కంపెనీకి వారే వెన్నెముక అనీ, వారి కృషి, నిజాయితీ, అంకితభావమే తమ కంపెనీవిజయానికి పునాది. అందుకే వారి శ్రమను గుర్తించడం, ప్రోత్సహించడం, కంపెనీని మరింత అభివృద్ధి దిశ,ఉన్నత శిఖరాలకు నడిపించడం ఏకైక లక్ష్యమని తెలిపారు.  వార్తా సంస్థ PTI ప్రకారం, భాటియా ఈ వారంలో ఉద్యోగులకు వాహనాలను అందజేశారు. ఆ తర్వాత షోరూమ్ నుండి కంపెనీ మిట్స్ హౌస్ ఆఫీస్ వరకు వేడుకగా "కార్ గిఫ్ట్ ర్యాలీ" కూడా జరిగిందట.

మీ విజయాన్ని లాభాలను ఉద్యోగులతో  పంచుకోవడం చాలా సంతోషం అంటూ భాటియాను చాలామంది నెటిజన్లు ప్రశంసించారు. అంతేకాదు ఈ వీడియోను తన మేనేజర్‌కి చూపిస్తే ఏఐ జనరేటెడ్‌ వీడియో అన్నారనీ, ఆ తరువాత డ్రైఫ్రూట్స్, 4 దీపాలు ఇచ్చారంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. 

వరుసగా మూడోసారి
గత  ఏడాది 15 కార్లను, అంతకు ముందు సంవత్సరం, 12 కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు  రాబోయే సంవత్సరంలో 50 కార్లను బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్టు భాటియా గత దీపావళికే ప్రకటించడం విశేషం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)